ఏపీ ఆర్‌బీకేలను ఐక్యరాజ్యసమితి అవార్డుకి నామినేట్‌ చేయడం గర్వకారణం – మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

Minister Kakani Govardhan Reddy Praises RBK System in Andhra Pradesh, Kakani Govardhan Reddy Praises RBK System in Andhra Pradesh, AP Minister Kakani Govardhan Reddy, Minister Kakani Govardhan Reddy, Kakani Govardhan Reddy, AP Agriculture Minister, AP Agriculture Minister Kakani Govardhan Reddy, RBK System in Andhra Pradesh, RBK System, AP RBK System, AP RBK System News, AP RBK System Latest News, AP RBK System Latest Updates, AP RBK System Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) ను ఐక్యరాజ్యసమితి అవార్డుకి నామినేట్‌ చేయడం గర్వకారణమని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ ఎఫ్‌ఏఓ అవార్డుకి ఏపీ ఆర్‌బీకే వ్యవస్థను కేంద్రప్రభుత్వమే నామినేట్‌ చేసిందని, దీంతో మన పథకాలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించినట్లయిందని మంత్రి తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 10,700 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటి ద్వారా రైతులకి ఎంతో లబ్ధి చేకూరుతోందని వెల్లడించారు.

అసలు మన ఆర్‌బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలో లేదని కేంద్ర మంత్రులు ప్రశంసించారని మంత్రి కాకాణి తెలియజేశారు. తాజాగా ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల, మండల కేంద్రాల వద్ద ఎటిఎం లను ఏర్పాటు చేశామని, త్వరలోనే మారుమూల పల్లెల్లోని ఆర్‌బీకే కేంద్రాల వద్ద కూడా ఎటిఎం లను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. దీనిద్వారా రైతులు డబ్బుల కోసం దగ్గరలోని పట్నాలకు వెళ్లనక్కరలేదని, వారి సొంత ఊరిలోనే డబ్బు పొందవచ్చని తెలిపారు. రైతులకి సంబంధించి మీ సేవా కేంద్రాలలో లభించే సేవలు అన్నీ ఆర్‌బీకే కేంద్రాల వద్దనే ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రాష్ట్రంలోని రైతులకు అని​ విధాలుగా అండగా ఉంటున్నామని, గత టీడీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన క్రాప్‌ ఇన్సూరెన్స్‌ బకాయిలను తమ ప్రభుత్వం వచ్చాక క్లియర్ చేశామని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − three =