ఏపీ శాసనసభలో రూ.41,436 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Minister Kakani Govardhan Reddy Present AP Agriculture Budget 2023-24 with Rs 41436 Cr at Assembly,Minister Kakani Govardhan Reddy,Minister Kakani Present AP Agriculture Budget,Agriculture Budget 2023-24,Agriculture Budget Rs 41436 Cr at Assembly,Mango News,Mango News Telugu,AP Assembly session,AP Assembly 2023,AP Assembly,AP Assembly Live Updates,AP Assembly Live News,AP Assembly Latest Updates,AP Assembly 2023 Live Updates,AP Assembly 2023 Latest News,AP Assembly Latest News,AP CM YS Jagan Mohan Reddy,AP Assembly Budget Session,AP Assembly 2023 State Budget,AP Assembly Budget News,AP Assembly Latest Budget Updates

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రూ.2,79,279 కోట్ల అంచనా వ్యయంతో 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం శాసనసభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 2023-24 సంవత్సరానికి గానూ రూ.41,436 కోట్లతో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అలాగే శాసన మండలిలో పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ముందుగా గురువారం ఉదయం శాస‌న‌స‌భ‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహ‌న్‌ రెడ్డిని మంత్రులు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు కలిసి వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ ప్ర‌తుల‌ను అంద‌జేశారు.

ఏపీ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్ కేటాయింపులు:

 • రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన పథకం కోసం – రూ.7,220 కోట్లు
 • విత్తనాల రాయితీ కోసం – రూ.200 కోట్లు
 • రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు
 • మార్కెటింగ్‌ శాఖ అభివృద్ధికి కేటాయింపులు – రూ.513.74 కోట్లు
 • సహకార శాఖకు కేటాయింపులు – రూ.233.71 కోట్లు
 • సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల అభివృద్ధి కోసం – రూ.100 కోట్లు
 • ఆహార పరిశ్రమల ప్రోత్సహకాల కోసం – రూ.146.41 కోట్లు
 • వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ కోసం – రూ.102.04 కోట్లు
 • వెంకటేశ్వర పశువైద్య వర్సిటీకి కేటాయింపులు – రూ.138.50 కోట్లు
 • ఆంధ్రప్రదేశ్‌ మత్స్యవర్సిటీకి రూ.27.45 కోట్లు
 • ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ కోసం – రూ.472.57 కోట్లు
 • పశువుల వ్యాధి నిరోధక టీకాల కోసం – రూ. 42.28 కోట్లు
 • వైఎస్ఆర్ పశు నష్టం పరిహారం కోసం – రూ.150 కోట్లు
 • ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్ల విలువైన ఎరువుల సరఫరా
 • ఆర్బీకేలలో 50 వేల టన్నుల ఎరువుల నిల్వ
 • ఆర్బీకేల ద్వారా రైతులకు 10వేల డ్రోన్లు
 • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ – రూ.286.41 కోట్లు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here