తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 22న ర‌వీంద్ర భార‌తిలో ఉగాది వేడుక‌లు, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

CS Santhi Kumari held Coordination Meeting over Ugadi Celebrations at Ravindra Bharati on March 22nd,CS Santhi Kumari held Coordination Meeting,Meeting over Ugadi Celebrations,CS Ugadi Celebrations at Ravindra Bharati,Ugadi Celebrations on March 22nd,Mango News,Mango News Telugu,Santhi Kumari Reviews Ugadi Celebrations,Ravindra Bharati Ugadi Celebrations News,Ravindra Bharati Ugadi Celebrations Updates,CS Santhi Kumari Latest News,CS Santhi Kumari Latest Updates,Ravindra Bharat Latest News

మార్చి 22వ తేదీన రవీంద్రభారతిలో నిర్వహించనున్న “శోభకృత నామ సంవత్సరం (ఉగాది)” ఉత్సవాల సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి ఆదేశించారు. ఉగాది పండుగ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై గురువారం ఆమె అధికారులతో సమీక్ష జరిపారు. బీఆర్కేఆర్ భవన్ లో ఈ రోజు జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి రమణాచారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వేదపండితులు, అవార్డు గ్రహీతలు ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు తగు రవాణా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. వేదిక, వేదిక అలంకరణ, ఆహ్వాన పత్రాల ముద్రణ, సీటింగ్‌ ఏర్పాట్లు, సాయంత్రం కవి సమ్మేళనం కోసం సాంస్కృతిక శాఖ తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. వేదిక వద్ద తాగునీటి సరఫరా, అదేవిధంగా నిరంతర విద్యుత్‌ సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన భద్రత కల్పించాలని, పార్కింగ్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని పోలీసు శాఖను సీఎస్ ఆదేశించారు. అలాగే ఈ నెల 21, 22 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన భవనాల్లో సూచికల ఏర్పాటు, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉగాది తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో అధికారులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, టూరిజం, సాంస్కృతిక శాఖ మఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, టీఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, హెఛ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ఎండీ దాన కిషోర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డీజీ ఫైర్ సర్వీసెస్ వై.నాగిరెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎం.హరికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =