మరోసారి చరిత్ర సృష్టించిన భారత్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, డైమండ్ లీగ్ లో స్వర్ణం

Indian Star Javelin Thrower Neeraj Chopra Creates History Becomes First Indian to Win Diamond League Meet, Neeraj Chopra Creates History Becomes First Indian to Win Diamond League Meet, First Indian to Win Diamond League Meet, Indian Star Javelin Thrower Neeraj Chopra, Tokyo Olympics gold medalist Neeraj Chopra, Javelin Thrower Neeraj Chopra, Indian Star Javelin Thrower, Neeraj Chopra, Diamond League Meet, Neeraj Chopra creates history, Lausanne Diamond League, Javelin Thrower Neeraj Chopra News, Javelin Thrower Neeraj Chopra Latest News And Updates, Javelin Thrower Neeraj Chopra Live Updates, Mango News, Mango News Telugu,

భారత్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. శుక్రవారం నాడు స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్ 2022లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. డైమండ్ లీగ్ ఈవెంట్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడుగా నీరజ్ చోప్రా గుర్తింపు పొందాడు. డైమండ్ లీగ్ లో నీరజ్ తోలి ప్రయత్నంలోనే 89.08 మీటర్ల భారీ త్రో చేశాడు. రెండో ప్రయత్నంలో 85.18 మీటర్లు విసిరాడు. కాగా ఇతర ఆటగాళ్ల బెస్ట్ 89.08 మీటర్ల కంటే తక్కువుగా నమోదు కావడంతో, మొదటి ప్రయత్నం 89.08 మీటర్ల త్రో తోనే నీరజ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో వచ్చే నెలలో జ్యూరిచ్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌కు, అలాగే 2023 బుడాపెస్ట్ హంగేరిలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు నీరజ్ చోప్రా అర్హత సాధించాడు,

మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌-2020 జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా 87.58 మీటర్ల విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. అలాగే గత నెల యూఎస్ఏలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్నాడు. అయితే గాయం కారణంగా బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్-2022లో నీరజ్ చోప్రా పాల్గొనలేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =