టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు అందిస్తాం – నారా లోకేష్

Nara Lokesh Says If TDP Comes To Power will be Given Permanent Caste Certificate Papers For All BC's,Nara Lokesh on TDP Comes To Power,BC Permanent Caste Certificate Papers,Caste Certificate For All BCs,TDP To Give BC Permanent Caste Certificate,Mango News,Mango News Telugu,Lokesh Recalls Efforts Made of BCs,Nara Lokesh,TDP Nara Lokesh Latest News,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,TDP BCs Caste Certificate Latest News

టీడీపీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌లోని బీసీలందరికీ శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువగళం పాదయాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా మద్దయ్యప్పగారి పల్లెలో బీసీ సామాజిక వర్గీయులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ఒక్క చాన్స్‌ ఇస్తే సామాజిక న్యాయం చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక నిధులు, అధికారం లేని పదవులు బీసీలకు ఇచ్చారని, ముఖ్యమైన పదవులు మాత్రం తన సొంత సామాజికవర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే సీఎం జగన్‌ తగ్గించిన బీసీ రిజర్వేషన్లను తిరిగి కల్పిస్తామని స్పష్టం చేశారు.

టీడీపీ అధికారం చేపట్టాక దామాషా ప్రకారం బీసీలకు అందాల్సిన నిధులు, రుణాలు అందిస్తామని, అలాగే తిరుమల సహా ఇతర ఆలయాలలో బట్టలు ఉతికే కాంట్రాక్టులు కూడా రజకులకే కేటాయిస్తామని నారా లోకేష్ తెలిపారు. ఇక గతంలో పేదవారి కడుపు నింపడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లను జగన్ సర్కార్ అన్యాయంగా మూసివేసిందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తిరిగి తెరిపిస్తామని చెప్పారు. ఇంకా విశ్వబ్రాహ్మణులు, రజకులు తదితరులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని సీఎం జగన్‌ మోసం చేశారని, అయితే వారికి టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టం తెచ్చి న్యాయపరమైన ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకుంటామన్న లోకేష్.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి రూ.10 లక్షల చంద్రన్న బీమా కూడా అమలు చేస్తామని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + eleven =