ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చ

BJP Top Leaders, Centre Decision on Privatisation of Visakhapatnam Steel Plant, Janasena Party, Janasena Party Response over Privatisation of Visakhapatnam Steel Plant, Mango News, pawan kalyan, Pawan Kalyan Went To Delhi, Pawan Kalyan Went to Delhi to Discuss Vizag Steel Plant Issue, Privatisation of Visakhapatnam Steel Plant, Privatisation of Visakhapatnam Steel Plant News, privatisation of Vizag Steel Plant, Visakhapatnam, Visakhapatnam Steel Plant, Vizag Steel Plant Issue

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరనున్నారని, దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రత్యక్షంగా ఈ విజ్ఞాపనను తెలుగువారి పక్షాన ఆయన తెలియచేస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ నేపథ్యంలో సోమవారం నాడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన సందర్భంగా బీజేపీ అగ్ర నాయకత్వంతో ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై, తెలుగు వారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 20 =