తొలిసారి అంచనాలు తలక్రిందులు

Ex-Minister Ganta Srinivasa Rao's New Trouble, Ex-Minister Ganta Srinivasa Rao, Ganta Srinivasa Rao New Trouble, TDP, Janasena, YCP, Congress, BJP, Ganta Srinivasa Rao, Chandra Babu, Lokesh, Botsa Satyanarayana, CM Jagan, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
TDP, Janasena, YCP, Congress, BJP, Ganta Srinivasa Rao, Chandra Babu, Lokesh, Botsa Satyanarayana

25 ఏళ్లుగా టీడీపీ సీనియర్ నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన  ఆడింది ఆట.. పాడింది పాటగా ఉంటూ వచ్చింది. నిజానికి తెలుగుదేశంపార్టీ తోనే గంటా రాజకీయం మొదలైంది. అయ్యన్నపాత్రుడు శిష్యుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గంటా.. 1999లో అనకాపల్లి ఎంపీగా విజయాన్ని సాధించారు. ఆ తర్వాత అయ్యనపాత్రుడితో తన రాజకీయ గురువు అని కూడా చూడకుండా ఆయనకే వ్యతిరేకంగా తయారయ్యారు.

2004లో మంత్రి అవ్వాలనే కోరికతో చోడవరం  అసెంబ్లీ నుంచి  పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లిన ఆయన..  అనకాపల్లి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కాంగ్రెస్ మంత్రి అయ్యారు. కానీ 2014 ఎన్నికలకు ముందు మాత్రం తన ప్రజారాజ్యం టీంతో కలిసి టీడీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు..టీడీపీ ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్నారు. మొత్తం ఏడేళ్ల పాటు కంటిన్యూగా మంత్రిగా కొనసాగిన గంటా శ్రీనివాస్ రావు..2019 ఎన్నికలలో కూడా  భీమిలి నుంచి విశాఖ నార్త్ నియోజకవర్గానికి మారి అక్కడ కూడా విజయాన్ని సాధించారు.

పదవుల కోసం పార్టీ మారతారన్న పేరును మూటగట్టుకున్న గంటాకు .. ఈసారి టిడిపిలో కొత్త చిక్కు వచ్చింది.  నాలుగేళ్ల పాటు టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాని ఆయన.. టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో బయటకు వచ్చేసారు.ఆ నాలుగేళ్లలో  జగన్ పైన, ఆయన ప్రభుత్వంపైన ఎప్పుడూ కూడా   గంటా విమర్శలు చేయలేదు.    అయితే  గంటా జిత్తుల మారి రాజకీయాన్ని గమనించిన చంద్రబాబు,  లోకేష్.. ఆయనకు  ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చారు. చివరకు పొమ్మన లేక పొగ పెట్టినట్లు గంటా పోటీ చేసే నియోజకవర్గం.. మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ ఉండడంతో గంటా అక్కడ పోటీ చేయనని.. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏదొక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని చెబుతూ వస్తున్నారు. దీంతో   చాలా వ్యూహాత్మకంగా గంటాను విశాఖ జిల్లా రాజకీయాల నుంచి తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన రెండు జాబితాలలోనూ గంటా పేరు ప్రకటించలేదు. దీంతో తన వియ్యంకుడు.. మాజీ మంత్రి నారాయణను వెంట బెట్టుకుని వెళ్లి మరీ చంద్రబాబుతో మరోసారి విన్నపాలు వినిపించినా ఫలితం దక్కలేదు. దీంతో గంటా అయిష్టంగానే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారయణపై పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ ససేమిరా అంటే ఆ సీటును కూడా గంటా కోల్పోవాల్సి వస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − five =