పంచాయతీల నిధుల మళ్లింపు పూర్తిగా అవాస్తవం, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం

2021 Telangana Assembly Session, CM KCR, CM KCR On Gram Panchayat Funds In Telangana Assembly, CM KCR Speech at Assembly over Funds Allocation to Village Panchayats, Funds Allocation to Village Panchayats, KCR Speech at Assembly, KCR Speech at Assembly over Funds Allocation to Village Panchayats, Mango News, Telangana Assembly, Telangana Assembly Session, Village Panchayats

గులాబ్‌ తుఫాను నేపథ్యంలో మూడు రోజుల పాటుగా వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి అక్టోబర్ 1, శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శాసన సభలో పంచాయతీ రాజ్‌ అంశంపై చర్చలో భాగంగా రాష్ట్రంలో పంచాయతీల నిధుల మళ్లింపు జరుగుతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీలక వివరణ ఇచ్చారు. పంచాయతీల నిధులు దారి మ‌ళ్లింపు ప్రచారం పూర్తిగా స‌త్య‌దూరమని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. భారతదేశంలోనే అత్యంత గౌర‌వంగా, గ‌ర్వంగా త‌ల ఎత్తుకుని చెప్పుకునే స‌ర్పంచ్‌లు ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ‌ రాష్ట్ర స‌ర్పంచ్‌ లేనని అన్నారు. ఈ అంశంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అధికారులు, కొన్ని సందర్భాల్లో ప్రధాని మోదీ, నీతి ఆయోగ్ కూడా ప్ర‌శంసించారని, కేంద్రం అనేక అవార్డులు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఒక వ్యక్తిపై సగటున గ్రాంట్ కింద రూ.4 ఖర్చు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం రూ.650కు పైగా ఖర్చు చేస్తోందని చెప్పారు. సభలో ఎవ‌రూ ఎవ‌రి గొంతు నొక్క‌డం లేదని, మీరు అద్భుతంగా మాట్లాడండి. మీ కంటే అద్భుతంగా మేం చెప్తాం. మ‌న ఇద్ద‌రికన్నా ప్ర‌జ‌లు అద్భుతంగా గ‌మ‌నిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వాల హ‌యాంలో స‌ర్పంచ్‌లు బాధ ప‌డ్డ మాట వాస్త‌వమని, ఇవాళ బాధ‌ప‌డ‌టం లేదని, చాలా సంతోషంగా ఉండి, గ‌ర్వ‌ప‌డుతున్నారన్నారు. క‌రోనా లాంటి సంక్షోభ సమయాల్లో కూడా డ‌బ్బుల‌కు ఇబ్బంది వ‌స్తే, శాస‌న‌స‌భ్యులు, మినిస్ట‌ర్ల జీతాలు ఆపి, పంచాయ‌తీలకు గ్రాంట్ రిలీజ్ మాత్రం ఆపొద్ద‌ని చెప్పానన్నారు. మరోవైపు ఏక‌గ్రీవ‌మైన గ్రామ‌ పంచాయ‌తీల‌కు నిధులు ఇస్తామ‌ని ప్రభుత్వం ఎక్క‌డా చెప్ప‌లేదన్నారు. మానిఫెస్టోలో గాని, నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలో ఆ ప్ర‌స్తావ‌నే లేదని చెప్పారు. నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టం ప్ర‌కారమే రాష్ట్రంలో నిధుల పంపిణీ, విడుద‌ల జ‌రుగుతుంద‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 17 =