రాష్ట్రం కోసం తాను నష్టపోవడానికైనా సిద్ధపడిన పెమ్మసాని

Pemmasani Is Ready To Lose Himself For The State, Pemmasani Is Ready To Lose, Ready To Lose Himself For The State, Ready To Lose For The State, Pemmasani Chandrasekhar, AP State Election, TDP candidate, TDP MP Candidate, Guntur, AP Elections, Guntur Candidate, Guntur MP Candidate, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pemmasani Chandrasekhar , AP State Election , TDP candidate

పొలిటీషియన్స్.. ప్రతీది వారికి రాజకీయమే.. ఏ విషయాన్ని అయినా వారు రాజకీయంగానే చూస్తుంటారు. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా దానిని రాజకీయంగా వారికి అనుకూలంగా మలుచుకుంటారు. పేరుకు అభివృద్ధి అని చెప్పినా.. ఈ కాలంలో వారి స్వలాభం కోసం పని చేసే నాయకులే ఎక్కువ. ఎన్నికల వేళ నాయకులు ఎన్ని హామీలు ఇచ్చినా.. ఆ తర్వాత ఏదో కారణాలు చెప్పి వాటిని అటుకెక్కిస్తుంటారు. తమకు పట్టనట్లు వ్యవహరిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. తనదైన శైలితో కదిలొస్తున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. తన వ్యవహారశైలి.. మాటతీరు.. పని తీరుతో అసలు రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలనే ప్రశంసలు అందుకుంటున్నారు.

ప్రస్తుత నాయకులు పదవులు, అధికారం దక్కే వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  అది చేస్తాం.. ఇది చేస్తామని హామీలు గుప్పిస్తుంటారు. ఒక్కసారి అధికారం చేతికొస్తే చాలు.. అందిన కాడికి దండుకోవడమే పనిగా పెట్టుకుంటారు. ప్రజ సంక్షేమాన్ని తుంగలో తొక్కి వారి స్వలాభం వారు చూసుకుంటారు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాల్లో లేకముందే తన సొంత నిధులతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. ప్రజాప్రతినిధులు పట్టనట్లు వ్యవహరించినా.. గుంటూరు ప్రజలకు నేనున్నానంటూ పెమ్మసాని ముందుకొచ్చి ప్రజలకు సేవ చేశారు.

ప్రజా సమస్యలను గాలికొదిలేసే నాయకులున్న ఈరోజుల్లో.. ప్రజల కోసం నష్టపోవడానికి కూడా ఏమాత్రం వెనుకాడడం లేదు పెమ్మసాని చంద్రశేఖర్. ప్రజల తరుపున పోరాడడానికి.. ప్రజల సమస్యలను తీర్చడానికి.. రాష్ట్రాభివృద్ధి కోసం తాను అన్ని విధాలుగా నష్టపోయినా ఏ మాత్రం లెక్క చేయనని పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. మాటలు చెప్పడమే కాదు.. దానిని చేతల్లో చేసి చూపిస్తున్నారు. ప్రజానాయకుడని అనిపించుకుంటున్నారు. పెమ్మసాని మాటతీరు.. పనితీరు.. ఆయనలోని సేవా గుణం చూసి గుంటూరు ప్రజలు ఆయనకు మద్ధతుగా నిలుస్తున్నారు.

గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్‌కు పెరుగుతున్న ప్రజాబలం చూసి ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎన్నారైలు ఎన్నికల ముందు సూటికేసులు తీసుకొని వస్తారని.. ఎన్నికల తర్వాత తిరిగి వెళ్తారని విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెమ్మసాని ఈ విమర్శలకు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. అందరిలా తాను అయిదు సంవత్సరాలు రాజకీయం చేయడానికి రాలేదన్న పెమ్మసాని.. 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటానని చెప్పారు. రాష్ట్రం కోసం.. గుంటూరు ప్రజల కోసం.. తెలుగు దేశం పార్టీ కోసం పోరాడుతానని పెమ్మసాని చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − twelve =