ఎవరీ పెమ్మసాని చంద్రశేఖర్?

Who is Pemmasani Chandrasekhar?, Pemmasani Chandrasekhar , TDP , AP State Election, Guntur Lok Sabha, Pemmasani Chandrasekhar, TDP MP Candidate, Guntur, AP Elections, Guntur Candidate, Guntur MP Candidate, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pemmasani Chandrasekhar , TDP , AP State Election , Guntur Lok Sabha

ప్ర‌జ‌ల్లో మంచిత‌నం.. గుండెల్లో నిబ్బ‌రం.. క‌ష్ట‌ప‌డే త‌త్వం.. సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్… ఎంతో కష్టపడి.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. జఠిలమైన సమస్యలకు ఏమాత్రం అదరకుండా, బెదరకుండా.. అనుకున్నది సాధించారు.. వైద్య రంగంతో పాటు, వ్యాపార రంగంలోనూ రాణిస్తూ.. విజయతీరాలకు చేరారు.. ఇప్పుడు గుంటూరు లోక్ సభ నుంచి టీడీపీ తరుపున ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు.

తెనాలి మండలం బుర్రిపాలేనికి చెందిన చంద్రశేఖర్‌ తండ్రి వ్యాపార రీత్యా  న‌ర్సరావుపేటలో స్థిరపడ్డారు. చంద్రశేఖర్‌ 1993-94లో ఎంబీబీఎస్ ఎంట్రన్స్‌లో ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సాధించారు. తరువాత మెడికల్‌లో పీజీ చేసేందుకు అమెరికా వెళ్లారు.  మెడికల్ పీజీ, ఇంటర్నల్ మెడిసిన్ లను పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గైసింగర్ వైద్య కేంద్రం నుంచి పూర్తి చేయడమే కాకుండా అందులో  అత్యధిక మార్కులు సంపాదించారు. తన ప్రతిభను దేశానికి చాటారు. పీజీ శిక్షణా సమయంలో సైతం అమెరికా దేశంలో జరిగే వైద్య విద్య విజ్ఞానపు పోటీల్లో పెన్సిల్వేనియా రాష్ట్రం తరఫున పాల్గొన్న అయన వరుసగా రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. అనంత‌రం వ్యాపార రంగంలోనూ అద్భుత ప్ర‌తిభ చూపారు. ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జయప్రదంగా వ్యాపారం నిర్వహిస్తున్నవ్యాపారవేత్తలకు అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఫోర్బ్స్ సంస్థ అవార్డులను అందిస్తుంది.

అలాంటి ఫోర్బ్స్ నుంచి డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌ 2020 సంవత్సరంలో ప్రతిష్టాత్మక “ఎర్నేస్ట్ ఎంటర్ప్రెన్యూర్“ అవార్డును అందుకున్నారు. ఇదేవిధంగా అమెరికాలోని అనీక ప్రతిష్టాత్మక మీడియా సంస్థలైన మీడియం, సీఈఓ వరల్డ్, ఫాస్ట్ మాగజైన్లు కూడా అవార్డులు అందించాయి . ఏఎస్‌యూ జీఎస్‌‌వీ సమ్మిట్ నుండి ఆయన సన్మానం అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సేవలను దృష్టిలో ఉంచుకొని సదరు సంస్థలు ఆయనకు తమ సభ్యత్వాన్ని ఇచ్చాయి. భారతీయ మూలాలు కలిగిన అమెరికా ఫిజిషియన్ అసోసియేషన్‌లో సైతం పెమ్మసాని సభ్యుడే. జీవితంలో ఏం సాధించాల‌న్నా వ్యక్తిగతమైన, వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అప్పుడే మ‌న సామర్థ్యాన్ని ఏ రంగంలోకి వెళ్లినా ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌మ‌ని పెమ్మ‌సాని నిరూపించారు.

రాజ‌కీయరంగంలోనూ పెమ్మ‌సాని త‌న‌దైన ముద్ర‌వేసుకుంటున్నారు. ఎంపీ అభ్య‌ర్థిగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటేందుకు ప్ర‌త్యేక‌శైలిలో ప్ర‌చారం సాగిస్తున్నారు. ఎందులోనైనా విజయం సాధించాలి అంటే డ‌బ్బు, పేరు మాత్ర‌మే చాల‌వు. టీం తో కలిసి పనిచేసే లక్షణం, టీంకు సహకరించే లక్షణం ఉండాలి. అంతేకాదు ఏదైనా తప్పు జరిగినప్పుడు అంగీకరించే స్వభావం, తప్పును దిద్దుకునే గుణం, పనిచేయడంలో సహనం అవసరం. చేసే పనిలో నిబద్ధత, అంకితభావం అవసరం.. వీటిని రాజ‌కీయ రంగంలోనూ ప్ర‌ద‌ర్శిస్తున్న పెమ్మ‌సాని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంటున్నారు. విద్య‌, వ్యాపార రంగాల్లో ఎన్నో అవార్డుల‌ను సొంతం చేసుకున్న డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.. రాజ‌కీయ రంగంలోనూ విజ‌యం సాధించి.. ఎంపీ.. పెమ్మ‌సాని  చంద్ర‌శేఖ‌ర్ అని పిలుపించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 14 =