పెమ్మ‌సాని – నారా లోకేశ్‌.. జ‌నాన్ని వ‌ద‌ల‌ని నేత‌లు – ఓడినా ఒక‌రు.. టికెట్ రాక‌పోయినా మ‌రొక‌రు..

Pemmasani - Nara Lokesh.. Leaders Who Don'T Let The People Down - One If They Lose.. If They Don'T Get The Ticket Another One.., Leaders Who Dont Let The People Down, If They Dont Get The Ticket Another One, Pemmasani, Nara Lokesh, Pemmasani Chandrasekhar, Nara Lokesh, Assembly Elections, AP State Elections, TDP Leaders, Lok Sabha Elections, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pemmasani Chandrasekhar , Nara Lokesh , assembly elections , Ap state elections , TDP leaders

ఆ ఇద్ద‌రూ నిస్వార్థ నాయ‌కులే. అందుకే అధికారం లేక‌పోయినా ప్ర‌జ‌ల‌కు దూరం కాలేదు. ప్ర‌జాసేవ‌ను వ‌ద‌ల‌లేదు. సొంత ప‌నులకే ప‌రిమితం కాలేదు. త‌మ‌ను న‌మ్ముకున్న జ‌నం కోసం  ఏదో రూపంలో సేవ చేస్తూనే ఉన్నారు. ప‌బ్లిసిటీ లేకుండా సంక్షేమ కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తూనే ఉన్నారు. వారే తెలుగుదేశం నాయ‌కులు నారా లోకేశ్‌.. మ‌రొక‌రు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌.

చంద్ర‌బాబునాయుడి త‌న‌యుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో తొలిసారి దిగిన లోకేశ్ పైనే 2019లో అంద‌రి దృష్టీ ప‌డింది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్ప‌ట్లో లోకేశ్ గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ కూడా లోకేశ్ విజయం ప‌క్కా అని చెప్పాయి.  చేనేత వర్గం, ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్న మంగళగిరిలో విజయం కోసం నారా లోకేశ్ గట్టిగానే ప్రచారం చేశారు. చివర్లో ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా ప్రచారం నిర్వహించారు.

1985 తరువాత టీడీపీ జెండా ఎగ‌ర‌ని మంగళగిరిలో.. నారా లోకేశ్ గెలిచి..  30 ఏళ్ల చరిత్రను తిరగరాస్తార‌ని అంద‌రూ భావించారు. కానీ.. నోటిఫికేష‌న్‌కు, ఎన్నిక‌ల‌కు కేవ‌లం 21 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డం.. అప్ప‌టికి లోకేశ్ పై స్థానికుల‌కు స‌రైన అవగాహ‌న లేక‌పోవ‌డం.. స్థానిక ప‌రిస్థితుల‌ను లోకేశ్ కూడా పూర్తి స్థాయిలో అధ్య‌య‌నం చేయ‌ని కార‌ణంగా.. కేవ‌లం 5,350 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ లోకేశ్ మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌ల‌పై అల‌గ‌లేదు.. వారికి దూరం కాలేదు. స్థానికుల‌కు తెలుసో.. తెలియ‌దో.. ప్ర‌తిప‌క్షంలో ఉండి కూడా నారా లోకేశ్‌…  ఐటీ ప‌రిశ్ర‌మ‌ను మంగ‌ళ‌గిరికి తీసుకొచ్చారు. చేనేత‌వృత్తిదారుల కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేశారు.

తొలి ప్రయత్నంలోనే తమకు అవకాశం దక్కాలని, ఆశించిన వెంటనే తమ ఆశలు ఫలించాలని నాయ‌కులు అంద‌రూ భావిస్తున్నారు. అధిష్ఠాన నిర్ణ‌యం నిర్ణయం తమకు కాస్త అనుకూలంగా లేక‌పోతే చాలు.. చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీలు మార్చేస్తారు. అధినాయకుడిని దూషిస్తారు.. అప్పటివరకు తమకు గుర్తింపునిచ్చిన పార్టీపై విచక్షణ కోల్పోయి దుమ్మెత్తిపోస్తారు.. కానీ.. ప్ర‌స్తుత గుంటూరు లోక్‌స‌భ కూట‌మి అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ అలాంటి నాయ‌కుల‌ను విభిన్నం.  రాజకీయాల‌తో సంబంధం లేకుండానే.. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన ఆయ‌న రాజ‌కీయాల్లోనూ హుందాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కొంతమంది అనుకుంటారు. పెమ్మసాని ఆశించిన వెంటనే అవకాశం దక్కిందని. కాదు కానే కాదు.. 2014 లోనే ఆయన పోటీకి సిద్ధమయ్యారు.. బలమైన ఆర్థిక నేపథ్యం ఉన్నా.. సేవా కార్య‌క్ర‌మాల ద్వారా మంచి పేరున్నా.., ఆయ‌న‌కు అవకాశం దక్కలేదు. తిరిగి 2019 లో మరలా సిద్ధమయ్యారు ప్రయత్నం ఫలించింది. అవకాశం దక్కింది. సర్వం సిద్ధం చేసుకున్నారు. చివరి క్షణంలో అనుకోని విధంగా తన స్థానాన్ని వేరొకరికి (రాయపాటి సాంబశివరావుకు) త్యాగం చేయాల్సివచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా, అధినాయకుడి ఆదేశాలే తనకు శిరోధార్యం అని భావించి.. డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని.. త‌న సీటును త్యాగం చేశారు.

చేతికి వచ్చిన అవకాశం చేజారిపోయినందుకు, నిరాశ నిస్పృహలకు గురికాలేదు. గుంటూరు, న‌ర‌సారావుపేట‌, నెల్లూరు త‌దిత‌ర ప్రాంతాల్లో తన సేవా కార్యక్రమాలను కొనసాగించారు..  పార్టీ పట్ల, చంద్రబాబు పై తన గౌరవాన్ని, తెలుగుదేశం పార్టీ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయ‌న అభిమానం, చిత్త‌శుద్ధి ఫలితంగా ఆయ‌న‌కు ఈ ఎన్నిక‌ల్లో గుంటూరు లోక్‌స‌భ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా అవ‌కాశం వ‌చ్చింది. ఆయ‌న‌కు విజ‌య అవ‌కాశాలూ పుష్క‌లంగానే ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + four =