కూటమిలో అసంతృప్తి సెగలతో నష్టం తప్పదా?

Purandheswari's Loss Due To Dissatisfaction In The Alliance?, Dissatisfaction In The Alliance, Purandareshwari Loss Due To Dissatisfaction, Purandareshwari Dissatisfaction, Daggubati Purandareshwari, BJP, Janasena, Somu Veerraju, Guduru Srinivas, Visakha MP Seat, CM Jagan, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News
Daggubati Purandareshwari,BJP, Janasena, Somu Veerraju,Guduru Srinivas,Visakha MP Seat,

విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని సిద్ధమయిన  ఏపీ  రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి.. రాజమండ్రి ఎంపీ స్థానాన్ని కేటాయించడంతో నిరుత్సాహానికి గురయినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా.. విశాఖ ఎంపీ టికెట్‌ను బీజేపీ ఆశించినా టీడీపీ  అధినేత చంద్రబాబు ఆ సీటుని వదులుకోవడానికి అంగీకరించలేదు.

విశాఖకు బదులు రాజమండ్రి ఎంపీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో..  దగ్గుబాటి పురంధేశ్వరి అక్కడ నుంచి  పోటీ చేస్తున్నారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా భరత్‌ను చంద్రబాబు ప్రకటించారు. రాజమండ్రి సీటు ఇవ్వడం వరకూ బాగానే ఉన్నా.. దీంతోనే పురంధేశ్వరికి ఇటు బీజేపీ, అటు టీడీపీ నేతలు నుంచి  సమస్య మొదలయ్యేలా కనిపిస్తోంది.

ఇప్పటి వరకూ ఏపీ బీజేపీకి అధ్యక్షుడిగా  పని చేసిన సోము వీర్రాజు.. ఈ సారి  రాజమండ్రి స్థానాన్ని ఆశించగా.. వీర్రాజును పక్కన పెట్టిన బీజేపీ ఆ సీటును పురంధేశ్వరికి కేటాయించింది.  దీనిపై అసంతృప్తితో ఉన్న వీర్రాజు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానంగానే ఉంది.కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు రాజమండ్రి  టికెట్ దక్కకపోవడంతో ఆ సామాజిక వర్గంలో తీవ్రంగా అసంతృప్తి నెలకొంది.

సోము వీర్రాజు వర్గం సహకారం  పురంధేశ్వరికి  అంతంత మాత్రమే ఉండేలా కనిపిస్తోంది. అలాగే టీడీపీ  విషయానికి వస్తే .. రాజమండ్రి ఎంపీ స్థానాన్ని టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఆశించారు.పొత్తులో భాగంగా ఇప్పుడు ఆ  సీటును బీజేపీకి  కేటాయించడంపై ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే బొడ్డు వెంకటరమణ చౌదరి.. జనసేన కోసం రాజానగరం అసెంబ్లీ సీటును  త్యాగం చేశారు. పోనీ ఎంపీ స్థానమైనా దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఆయనకు ..ఇప్పుడు ఆ సీటును బీజేపీకి కేటాయించి పురంధేశ్వరిని పోటీకి దింపడంతో  అసమ్మతి సెగలు మొదలయ్యాయి.

పురంధేశ్వరికి ఇప్పుడు అటు సొంత పార్టీలోని సోము వీర్రాజు నుంచి, మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నుంచి సహకారం లభిస్తుందా అనేది కూటమిలో పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అంతేకాదు పురంధేశ్వరికి  రాజమండ్రి ఎంపీ స్థానాన్ని కేటాయించడంపై పార్టీ సీనియర్ నేతలు బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు, మరో సీనియర్ నేత గన్ని కృష్ణ బీజేపీ అధిష్టానంపై  తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.వీరందరినీ సమన్వయం చేసుకుని పురంధేశ్వరి ముందుకు వెళ్లడం నిజంగా కత్తి మీద సాములాంటిదేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − thirteen =