ఈ సారి ఏ పార్టీని గెలిపిస్తారో?

Prepare For Battle In Pendurthi, Battle In Pendurthi, Pendurthi Battle, Pendurthi Assembly Constituency, Pendurthi, YCP, Jana Sena, CM Jagan, TDP, TDP Candidate, Pawan Kalyan, Chandrababu, Andra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Pendurthi Assembly constituency,Pendurthi,YCP,Jana Sena, CM Jagan, TDP, TDP candidate,Pawan Kalyan, Chandrababu

ఎన్నికల హీటు పెరిగిపోవడంతో నేతల చూపుతో పాటు ఓటర్ల చూపు ఏ పార్టీ గెలుస్తుందా అన్నదానిపైనే ఉంది. అందుకే ఏ జిల్లా ఏ  పార్టీని గెలిపిస్తుంది.. ఏ నియోజక వర్గం ఏ పార్టీ అభ్యర్థికి విజయాన్ని అందిస్తున్న చర్చలు ఏపీ వ్యాప్తంగా ఊపందుకున్నారు. అలా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న మరో నియోజకవర్గం పెందుర్తి గురించి నేతలు ఆరా తీస్తుంటే.. ఏపీ వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గంలో 2,11,366 మంది ఓటర్లు ఉండగా..వీరిలో పురుషు ఓటర్లు 1,02,179 మంది కాగా, 1,09,182 మంది మహిళలు ఉన్నారు.ఇప్పటి వరకు పెందుర్తి నియోజకవర్గంలో 13 సార్లు ఎన్నికలు జరగగా, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు, ఒకసారి సీపీఐ, ఒకసారి ప్రజారాజ్యం పార్టీ, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ విజయం సాధించారు.

1967లో పెందుర్తి నియోజకవర్గంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన జి. బుచ్చి అప్పారావు .. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అల్లు దశావతారంపై విజయాన్ని సాధించారు. 1972లో  ఇండిపెండెంట్ అభ్యర్థి  ఏఎస్ఆర్ ఉప్పలపాటి .. కాంగ్రెస్  అభ్యర్థి  బీఏ గొర్రెపాటిపై గెలిచారు.

1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జి. అప్పన్న .. సిపిఎం అభ్యర్థి ఐ.ఎస్ గంగాధర రెడ్డిపై విజయాన్ని సాధించారు.  1980లో  కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి సత్యనారాయణ .. ఇండిపెండెంట్ అభ్యర్థి  పి .సింహాచలాన్ని ఓడించారు. 1983లో టీడీపీ నుంచి బరిలో దిగిన పి .అప్పల నరసింహం .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి .సత్యనారాయణపై గెలిచారు.

1985లో  టిడిపి నుంచి బరిలో దిగిన ఏ .రామచంద్రరావు ..కాంగ్రెస్ అభ్యర్థి జి. గురునాథరావుపై  విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జి . గురునాధరావు .. టీడీపీ అభ్యర్థి పి .సింహాచలాన్ని ఓడించారు.  1994లో  సిపిఐ నుంచి బరిలో దిగిన  ఎం.ఆంజనేయులు ..కాంగ్రెస్ అభ్యర్థి డి. శ్రీనివాస్‌పై విజయాన్ని దక్కించుకున్నారు.

1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పి.గణబాబు.. కాంగ్రెస్ అభ్యర్థి  డి.శ్రీనివాస్‌ని ఓడించారు. 2004లో  కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పి .గురుమూర్తి రెడ్డి.. టీడీపీ అభ్యర్థి జి. నాగమణిపై  గెలిచారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఎంట్రీ ఇవ్వడంతో..ఆ  పార్టీ నుంచి బరిలో దిగిన పి.రమేష్ బాబు..కాంగ్రెస్ అభ్యర్థి గండి బాబ్జిని ఓడించారు. 2014లో టీడీపీ నుంచి బరిలో దిగిన బండారు సత్యనారాయణమూర్తి.. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరి అక్కడ నుంచి పోటీ చేసిన గండి బాబ్జిని ఓడించారు. అయతే 2019లో వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు అన్నపురెడ్డి..టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే  బండారు సత్యనారాయణమూర్తిని ఓడించారు.

వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేయడానికి  వైసీపీ నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మరోసారి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తుండగా.. మరో ఇద్దరు నేతలు కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మరోసారి  బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. అలాగే జనసేన పార్టీ నుంచి  పంచకర్ల రమేష్ బాబు ఈ సీటును ఆశిస్తున్నారు. మరి పెందుర్తి వాసులు ఎవరికి పట్టం కడతారో చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 15 =