రాజకీయ ప్రయోజనాలకే ప్రాముఖ్యత

Harirama Jogaiahs Son Joins YCP, Jogaiahs Son Joins YCP, Harirama Joins YCP, Harirama Into YCP, Harirama Jogaiah Son, YCP, Surya Prakash, Jana Sena, CM Jagan, TDP, Jana Sena Alliance, Achanta Seat, TDP Candidate, Pawan Kalyan, Chandrababu, Mango News, Mango News Telugu
Harirama Jogaiah's son, YCP,Surya Prakash, Jana Sena, CM Jagan, TDP, Jana Sena alliance, Achanta seat, TDP candidate,Pawan Kalyan, Chandrababu

సొంత సామాజిక వర్గ బాగు కంటే, సామాజిక సేవ కంటే  ఇంకా చెప్పాలంటే  రాజకీయ విలువల కంటే  కూడా రాజకీయ ప్రయోజనాలకే ఇప్పుడు నేతలంతా పెద్ద పీట వేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. చివరకు తెల్లారి లేస్తే లెటర్ల మీద లెటర్లు రాస్తూ సుద్దులు చెప్పే నేతలు కూడా రాత్రికి రాత్రి కండువాలు మార్చడానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్‌ ఎలా ఉండాలి..  ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి.. జనసేన ఎక్కడ నుంచి పోటీ చేస్తే మంచిది..కాపు సామాజిక వర్గ ప్రయోజనం కోసం పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి వంటి సలహాలతో వరుస లెటర్లు రాస్తున్న సీనియర్ నేత హరిరామ జోగయ్య తన కొడుకును ఇప్పుడు వైఎస్సార్సీపీలోకి పంపించడం పెద్ద ఎత్తున చర్చకు  దారి తీస్తోంది.

జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్‌కు షాక్ ఇవ్వడానికి హరిరామయ్య జోగయ్య కొడుకు సూర్య ప్రకాశ్.. ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరడానికి రెడీ అయ్యారు. జనసేన పీఏసీ పదవికి రాజీనామా చేసిన ఆయన..ఒకటి రెండు రోజుల్లో సీఎం జగన్ సమక్షంలో  వైఎస్సార్సీపీలో చేరనున్నారు.తెలుగు దేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా ఆచంట సీటును తెలుగు దేశం పార్టీ అభ్యర్థికి కేటాయించారు. దీంతో జనసేన ఇంఛార్జ్‌గా ఉంటున్న సూర్యప్రకాశ్ నిరాశ చెంది జగన్ పంచన  చేరడానికి రెడీ అయ్యారు. పార్టీ కండువా కప్పుకోగానే..పాలకొల్లు అసెంబ్లీ నియోజవర్గం వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌గా సూర్యప్రకాశ్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు  హరిరామజోగయ్య మరోసారి తన లేఖాస్త్రానికి పదును పెట్టి మరీ  పవన్ తీరును  తప్పుబట్టారు. తనను పవన్  కోవర్టు అనడంపై సీరియస్ అయిన హరిరామ జోగయ్య.. జనసేన పార్టీ బాగుకోసం… కాపుల ప్రయోజనాలు కాపాడటానికి తాను  ఇస్తున్న సలహాలు పవన్‌కు నచ్చినట్లు లేవని అన్నారు. చంద్రబాబే సిఎం .. వేరేవాళ్లకు సీఎం అవకాశం లేదని లోకేష్ చేసిన ప్రకటనను తాను ఖండించినందుకు  అధికార పార్టీకి కోవర్ట్ నని అనడం తగదన్నారు. పవన్‌కు నచ్చినా లేకపోయినా పవన్ ‌ను కాపాడుకోవడం తన విధి అని….తాను చచ్చే వరకు తన ప్రవర్తన ఇలానే ఉంటుందని తేల్చి చెప్పారు.అయితే ఇంత వరకూ బాగానే ఉన్నా.. కాపు నియోజకవర్గం బాగు కోసం పవన్ పై పదే పదే విరుచుకుపడే జోగయ్య.. తన కొడుకును జగన్ సైడ్ చేర్చడం ఎంత వరకూ కరెక్ట్ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =