రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆంధ్రప్రదేశ్ విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనను విశాఖపట్నంలో ప్రారంభించారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం విశాఖ సాగర తీరంలో ‘నేవీ డే సెలబ్రేషన్స్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో భారత నౌకాదళ విన్యాసాలను తిలకించారు. ముందుగా ఐఎన్‌ఎస్ ‘సింథ్ వీర్’ సబ్‌మెరైన్ ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ పతాక బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది. హెలికాప్టర్ నుంచి నేవీ మెరైన్ కమాండోల విన్యాసాలు, యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ నిర్వహణ, కమాండోల టీమ్ వర్క్, 4 యుద్ధ నౌకలపై హెలికాప్టర్లు ఒకేసారి టేకాఫ్ మరియు ల్యాండింగ్ కావడం వంటివి ఆకట్టుకున్నాయి. నేవీ విన్యాసాలను రాష్ట్రపతి ముర్ము ఆసక్తిగా తిలకించారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత ఐఎన్‌ఎస్ డేగ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్, రాష్ట్ర మంత్రులు సహా పలువురు అధికారులు ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.
అనంతరం తిరుపతి చేరుకుని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, పూజారులు పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ క్రమంలో ఛైర్మన్, ఈవోలు శ్రీవారి శేష వస్త్రాన్ని, స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారు కొలువైన ఈ క్షేత్రానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆ తరువాత అలిపిరిలోని గోశాల దర్శించారు. తిరుచానూరు అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి హాజరై విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ఢిల్లీకి పయనమవనున్నారు. ఇక దీనికిముందు ఆదివారం విజయవాడలో రాష్ట్రపతి ముర్ముకు ఏపీ ప్రభుత్వం పౌరసన్మానం నిర్వహించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE