ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల, నాలుగు దశల్లో ఎన్నికలు

Andhra Gram Panchayat elections, Andhra Pradesh panchayat elections, Andhra Pradesh panchayat elections News, Andhra Pradesh Panchayat Polls, Andhra Pradesh SEC, Andhra Pradesh SEC announces gram panchayat polls, AP Gram Panchayat Elections, AP Gram Panchayat Elections Schedule, AP SEC Announces Gram Panchayat Elections, AP SEC Announces Gram Panchayat Elections Schedule, Gram Panchayat Elections In AP, Mango News Telugu

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తేదీలను ఆయన వెల్లడించారు. జనవరి 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. ఫిబ్రవరి 5న తొలిదశ, 9న రెండో దశ, 13న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

ఏపీ పంచాయతీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్ -1

  • నోటిఫికేషన్ జారీ: జనవరి 23
  • నామినేషన్ల స్వీకరణ: జనవరి 25
  • నామినేషన్ చివరి రోజు: జనవరి 27
  • నామినేషన్ల పరిశీలన: జనవరి 28
  • ఉపసంహరణ చివరి తేదీ: జనవరి 31
  • ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 5
  • లెక్కింపు తేదీ: ఫిబ్రవరి 5

ఏపీ పంచాయతీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్ -2

  • నోటిఫికేషన్ జారీ: జనవరి 27
  • నామినేషన్ల స్వీకరణ: జనవరి 29
  • నామినేషన్ చివరి రోజు: జనవరి 31
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 1
  • ఉపసంహరణ చివరి తేదీ: ఫిబ్రవరి 4
  • ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 9
  • లెక్కింపు తేదీ: ఫిబ్రవరి 9

ఏపీ పంచాయతీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్ -3

  • నోటిఫికేషన్ జారీ: జనవరి 31
  • నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 2
  • నామినేషన్ చివరి రోజు: ఫిబ్రవరి 4
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 5
  • ఉపసంహరణ చివరి తేదీ: ఫిబ్రవరి 8
  • ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 13
  • లెక్కింపు తేదీ: ఫిబ్రవరి 13

ఏపీ పంచాయతీ ఎన్నికల ముఖ్య తేదీలు: ఫేజ్ -4

  • నోటిఫికేషన్ జారీ: ఫిబ్రవరి 4
  • నామినేషన్ల స్వీకరణ: ఫిబ్రవరి 6
  • నామినేషన్ చివరి రోజు: ఫిబ్రవరి 8
  • నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 9
  • ఉపసంహరణ చివరి తేదీ: ఫిబ్రవరి 12
  • ఎన్నికల తేదీ: ఫిబ్రవరి 17
  • లెక్కింపు తేదీ: ఫిబ్రవరి 17
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × four =