అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి – రెవెన్యూ శాఖలపై సమీక్షలో సీఎం జగన్‌

CM YS Jagan Held Review Meet on Revenue Generating Departments in AP Today,CM YS Jagan Held Review Meet,AP Revenue,AP Revenue Generating Departments,Mango News,Mango News Telugu,AP CM YS Jagan Mohan Reddy , YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates, Andhra Pradesh, YSR Party

అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన సోమవారం తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీలోని రెవెన్యూ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ, భూ గర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యంలో వార్షిక ఆదాయ వసూళ్లు ప్రోత్సాహకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సీఎం జగన్ అధికారులకు చేసిన కొన్ని కీలక సూచనలు..

  • బెల్టు షాపులు ఎత్తేయడం, మద్యం ధరలు పెంచడం ఇత్యాది కారణాల వలన రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గింది.
  • పన్ను వసూళ్లలో మరింత సమర్థత సాధించేటప్పుడు ఎలాంటి లీకేజీలు ఉండకూడదు.
  • రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు పన్నుల వసూళ్లలో లొసుగులను, లీకేజీలను పూడ్చుకుంటూ పారదర్శకత పాటించాలి.
  • అవసరమైతే పన్నుల వసూళ్లలో లీకేజీలను అరికట్టేందుకు ప్రొఫెషనల్ ఏజెన్సీల సేవలను వినియోగించుకోవాలి.
  • పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వ పాలసీల సౌలభ్యం మరియు పారదర్శకతను అందించాలి.
  • తద్వారా పన్నుల సజావుగా వసూలు చేయడానికి తప్పనిసరి అని ఆయన అన్నారు.
  • స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (యస్ఈబీ) ఆధ్వర్యంలో అక్రమ మద్యం తయారీపై దృష్టి సారించాలి.
  • అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తరచుగా ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలి.
  • కల్తీ మద్యం, బెల్టు షాపులపై గ్రామాల్లో పని చేస్తున్న మహిళా పోలీసుల నుంచి రోజువారీ నివేదికలు తెప్పించుకోవాలి.
  • వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
  • శాశ్వత భూ హక్కు, భూ సర్వే జరుగుతున్న గ్రామాలు మరియు వార్డుల్లో సబ్ రిజిస్ట్రార్ భవనం, సేవలు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయాన్ని పెంచడంతోపాటు లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
  • అందుబాటులో ఉన్న సేవలను పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడానికి గ్రామ సచివాలయాలు మరియు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలలి.
  • అలాగే ప్రజల నుంచి ఫిర్యాదుల సేకరణకు సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
  • రాష్ట్రంలోని అన్ని గనులు రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించుకోవడంలో తోడ్పడాలి.
  • ఇందుకోసం మైనింగ్ లీజుదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 17 =