అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌లో భద్రతా వైఫల్యం

Security Lapse in US Presidents Convoy,Security Lapse in US Convoy,US Presidents Convoy,americann president joe biden,US President Joe Bidens motorcade, joe biden, america, president convoy,Mango News,Mango News Telugu,US President Joe Biden,US Presidents Convoy Latest News,US Presidents Convoy Latest Updates,US Presidents Convoy Live News,Security Lapse Latest News,Security Lapse Latest Updates
americann president joe biden, joe biden, america, president convoy

ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు. ఆయనకున్నంత భద్రత ప్రపంచంలో ఏ అధ్యక్షుడికి కూడా ఉండదు. యూఎస్ సీక్రెట్ సర్వీసెస్ అధ్యక్షుడి భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇక అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనలు చేసినప్పుడు భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తారు. అధ్యక్షుడి కంటే వారం రోజుల ముందే సెక్యూరిటీ సిబ్బంది ఆయా దేశాలకు వెళ్తుంటారు. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత కలిగిన వ్యక్తి కాన్వాయ్‌ను ఓ ప్రైవేట్‌ కారు ఢీ కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాలో తీవ్ర కలకలం రేపుతోంది.

ఆదివారం రాత్రి డెలావర్‌లో అధ్యక్షుడి కాన్వాయ్‌ను ప్రైవేట్ కారు ఢీ కొట్టింది. అయితే ఆదివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ డెలావర్‌లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు. రాత్రి అక్కడే డిన్నర్ పూర్తి చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఆఫీస్ బయట ఉన్న తమ కాన్వాయ్ వద్దకు వెళ్తుండగా.. గుర్తు తెలియని ఓ ప్రైవేట్ కారు వేగంగా దూసుకొచ్చి యూఎస్ సెక్యూరిటీ సర్వీస్ వాహనాన్ని ఢీ కొట్టింది. అ తర్వాత మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది.

అయితే ఈ ఘటన జరిగిన సమయంలో జిల్ బైడెన్ కారులో కూర్చొని ఉండగా.. జో బైడెన్ తన వాహనానికి సమీపంలో రోడ్డుపైనే నిల్చొని ఉన్నారు. బైడెన్‌కు కేవలం 130 అడుగుల దూరంలో ఉన్న వాహనాన్నే గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై బైడెన్‌ను కారులోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత సేఫ్‌గా అధ్యక్షుడు, ప్రథమ మహిళను అక్కడి నుంచి వైట్ హౌస్‌కు తరలించారు. ప్రస్తుతం జో బైడెన్, జిల్ బైడెన్ సురక్షితంగా ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

ఇక ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆ కారును చుట్టుముట్టారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకు కాన్వాయ్‌ను ఢీ కొట్టాడు..? ఈ ఘటన వెనుక ఎవరి పాత్ర ఉంది..? అనే కోణంలో సెక్యూరిటీ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 7 =