ఒక్కరోజే 78 మంది ఎంపీల సస్పెన్షన్

Suspension Of 78 MPs In One Day, Suspension Of 78 MPs, Suspension In One Day, Suspension Of MPs, Suspension Of MPs In One Day, Parliament, Lokh sabha, Rajya sabha, MPS suspension, Mango News, Mango News Telugu, Latest Parliament News, Latest MPs Suspension News, Latest Parliament Updates, Telangana News, Telangana Political News
Parliament, Lokh sabha, Rajya sabha, MPS suspension

పార్లమెంట్‌లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడి అలజడి సృష్టించిన ఘటన దేశాన్నే కుదిపేసింది. అత్యంత కుట్టుదిట్టమైన భద్రత నడుమ ఆగంతకులు లోక్‌సభలోకి వెళ్లి టియర్ గ్యాస్ లీక్ చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభలు దద్దరిళ్లిపోతున్నాయి. పెద్ద ఎత్తున విపక్ష ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారు.  సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ నిరసన చేపట్టడంతో.. సోమవారం ఒక్కరోజే 78 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.

లోక్‌సభలో 33 మంది విపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. అందులో 30 మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అలాగే మిగిలిన ముగ్గురు ఎంపీలు విజయ్ వసంత్, జయకుమార్, అబ్దుల్ ఖలీఖ్‌లను ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభాపతి ఆదేశాలు దిక్కరించినందుకు గానూ సభ్యుల సస్పెన్షన్ తీర్మానాన్ని.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సభలో ప్రవేశ పెట్టారు. దానికి మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

రాజ్యసభలో కూడా ఎంపీలు ఆందోళన సృష్టించడంతో.. 45 మందిపై వేటు పడింది. 34 మంది ఎంపీలపై శీతాకాల సమావేశాలు ముగిసే వరకు వేటు పడింది. మిగిలిన 11 మందిని మాత్రం ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు రణ్‌దీప్ సూర్జేవాలా, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఇతర పార్టీల విపక్ష నేతలపై జగదీప్ ధన్‌ఖడ్ వేటు వేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − one =