శ్రీశైలం: దుకాణాల వేలం రద్దు

AP Govt Transfers The EO Of Temple, AP Govt Transfers The Temple EO, AP Political Updates 2019, Mango News Telugu, Srisailam Latest News Updates, Srisailam Shops Auction Issue, Srisailam Shops Auction Issue Latest News, Srisailam Shops Auction Issue- AP Govt Transfers The Temple EO

శ్రీశైలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, మంగళవారం నాడు చలో శ్రీశైలం కార్యక్రమానికి హిందూ సంఘాలు పిలుపునివ్వడంతో ఆలయ సమీపంలో పోలీసులు భారీఎత్తున మోహరించారు. లలితాంబిక దుకాణ సముదాయంలో వేలం పాటలో హిందూయేతర వ్యాపారస్తులకు, బీజేపీ నాయకులకు మధ్య జరిగిన వాగ్వాదం వలన శ్రీశైలంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసాయి. దుకాణ సముదాయాలను, కాంట్రాక్టులను హిందూయేతరలకు కట్టబెట్టడాన్ని హిందూవాదులు, పీఠాధిపతులు ఖండిస్తున్నారు. అయితే శ్రీశైలం దుకాణాల వేలంపాటను రద్దుచేయాలని దేవాదాయ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పూర్తీ వివరాలు అందాక బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. శ్రీశైలం దేవాలయ పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వెల్లడించారు.

మరోవైపు దుకాణాల వేలం రద్దు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. శ్రీశైలం లాంటి పవిత్ర ఆలయాలలో అన్య మతస్తులకు చోటు ఇవ్వకుండా హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆయన పిలుపు నిచ్చారు. అంతే కాకుండా శ్రీశైలం ఆలయ ఈవో శ్రీరామచంద్రమూర్తి బదిలీ అయ్యారు, ఆయన స్థానంలో కేఎస్ రామారావును నూతన ఈవోగా నియమిస్తున్నట్టు ఆదేశాలు జారీచేశారు. రెండు రోజుల్లో నూతన ఈవో బాధ్యతలు స్వీకరించనున్నారు.

 

[subscribe]
[youtube_video videoid=rhL9AyAzld4]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + three =