శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై సిబ్బంది దాడి

Staff attacked Andhra devotees in Srirangam temple,Staff attacked Andhra devotees,Andhra devotees in Srirangam temple,devotees in Srirangam,Srirangam temple, Tamilnadu, Andhra devotes,Mango News,Mango News Telugu,Five persons were injured,5 Injured In Clash,Tension grips Srirangam temple,5 hurt as pilgrims from Andhra,Brawl inside Srirangam Temple,Ruckus at Srirangam temple,Srirangam temple staff Latest News,Srirangam temple staff Latest Updates,Srirangam Temple Latest News,Srirangam Temple Live Updates
Srirangam temple, Tamilnadu, Andhra devotes

తమిళనాడులోని ఓ ఆలయంలో ఆంధ్రా భక్తులపై సిబ్బంది దాడికి పాల్పడిన వైనం సంచలనంగా మారింది. రక్తం వచ్చేలా దాడి చేయడంతో భక్తులు ఆలయంలోనే నిరసన చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సాధారణంగా స్వాములు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం అనంతరం ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. ఆ తర్వాతే ఇంటికి చేరుకుంటారు. ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన ముప్పై మంది స్వాములు శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కలు చెల్లించుకున్నాక.. అక్కడి నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగ స్వామివారి ఆలయానికి వెళ్లారు. అయితే ఆలయంలోకి భక్తులు క్యూలో వెళ్తుండగా.. ఆంధ్రా భక్తుల్లో కొందరు మధ్యలో వెళ్లి నిల్చున్నారు.

ఆ తర్వాత గర్భగుడి ముందున్న గాయత్రి మండపంలో ఆంధ్రా భక్తులంతా గంపుగా గుమికూడడంతో రద్దీ నెలకొంది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ.. ఆలయ సిబ్బంది వారికి సూచించారు. ఈ సమయంలో సిబ్బంది కాస్త  అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్త తారాస్థాయికి చేరుకుంది. ఓ భక్తుడిపై ఆలయ సిబ్బంది రక్తం వచ్చేలా చితకబాదారు. దీంతో ఆలయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తకరంగా మారింది. ఆ తర్వాత ఆంధ్రా భక్తులు ఆలయం వెలుపలే నిరసన చేపట్టారు. సిబ్బంది అత్యుత్సాహంతోనే గొడవ పెద్దది కావడంతో.. అక్కడున్న మిగిలిన భక్తులు కూడా నిరసనలో పాల్గొన్నారు.

పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఆలయ సిబ్బందిని, భక్తులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు ముగ్గురు ఆలయ సిబ్బందిపై కేసు నమోదు చేశారు. అటు భక్తులపై కూడా ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో వారిపై కూడా పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే ఆలయంలో ఉద్రిక్తత కొనసాగుతున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =