ఈ ఏడాదిలో నెటిజన్లు దేని గురించి ఎక్కువగా వెతికారో తెలుసా?

Top search items on google,Top search items,Items on google,Google Search, Top search items on google, netizens searched , netizens ,Chandrayaan 3,Mango News,Mango News Telugu,Top Google Searches,Most Searched Things on Google,Top Trending Google Searches,Most Searched Things,Top Google Searches News Today,Top Google Searches Latest Updates,Top Google Searches Live News,Google Search Latest News
Google Search, Top search items on google, netizens searched , netizens ,Chandrayaan 3

ఒకప్పుడు తెలిసిన విషయాన్ని మరింతగా తెలుసుకోవడానికి అయినా.. తెలియని విషయాన్ని కొత్తగా తెలుసుకోవాలన్నా కూడా ఏ టీచర్‌నో, కాస్త విషయ జ్ఞానం ఉన్న పెద్దవాళ్ల దగ్గరకో వెళ్లి అడిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ టీచర్లు కూడా గూగుల్‌లోనే సమస్త సమాచారాన్ని  తెలుసుకునే రోజులు వచ్చేశాయి.  చదువు నుంచి జబ్బుల వరకూ , కవితల నుంచి సినిమాల వరకూ, సైన్స్ నుంచి అంతరిక్షం వరకూ  ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా చిటికెలో చెప్పేస్తున్న గూగులమ్మ ఇప్పుడు అందిరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది.

నిజమే రోజుకు కొన్ని వేల, లక్షల ప్రశ్నలకు గూగుల్ ప్రతీరోజూ సమాధానాలు చెబుతోంది. అయితే ఎన్ని ప్రశ్నలు అడిగినా.. గూగుల్‌లో కొన్ని సమయాలలో హాట్ టాపిక్ అయిన విషయాల గురించే ఎక్కువ మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. అలా సెర్చ్ చేసినవే  ట్రెండింగ్ టాపిక్స్ అవుతూ ఉంటాయి.   అలా  ఈ ఏడాది భారత్‌లో ఎక్కువ మంది గూగుల్‌లో దేని గురించి సెర్చ్ చేశారో చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది.   2024 ఏడాదికి వెల్కమ్ చెప్పడానికి  మరెన్నో రోజులు లేవు. కొద్ది రొజుల్లోనే ఈ ఏడాది ముగిసిపోతుంది. అలా ఈ ఏడాదిలో ఎక్కువ మంది నెటిజన్లు ఏ విషయం గురించి తెలుసుకున్నా.. టాప్ లో మాత్రం కొన్నే ఉన్నట్లు ఇయర్ ఇన్ సెర్చ్ రిపోర్ట్ ఇచ్చింది.

ఇయర్ ఇన్ సెర్చ్ 2023 ప్రకారం.. ఈ ఏడాది ఎక్కువమందిని ఆకర్శించిన చంద్రయాన్ 3 టాప్ వన్ లో ఉంది . ప్రపంచం  దృష్టిని తనవైపు తిప్పుకున్న సంఘటనల్లో చంద్రయాన్-3 సక్సెస్ ఒకటిగా ఉండటంతో చాలామంది దీని గురించి సెర్చ్ చేసినట్లు ఇయర్ ఇన్ సెర్చ్ చెప్పింది. ఆ తరువాత పొలిటికల్‌గా చూసుకుంటే.. కర్ణాటక ఎన్నికలు, దాని తర్వాత తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా నెటిజన్లు  ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేశారట. అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్దానికి సంబంధించిన విషయాలతో పాటు బడ్జెట్ 2023 విషయాలు, టర్కీ భూకంపం గురించి, ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన వార్తలను ఎక్కువమంది గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తాజాగా తెలుస్తోంది.

అయితే పైన తెలిపిన విషయాలు మాత్రమే కాకుండా చాట్‌జీపీటీ, యూనిఫాం సివిల్ కోడ్ సంబంధిత చాలా విషయాల గురించి కూడా గూగుల్ ‌లోసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా జీ20 అంటే ఏమిటి,యూసీసీ అంటే ఏమిటి, చాట్‌జీపీటీ అంటే ఏమిటి, చాట్ జీపీటీని ఎలా వాడాలి, ఇన్‌స్టాగ్రామ్‌ థ్రెడ్‌ అంటే ఏమిటి, హమాస్ అంటే ఏమిటి, 2023 సెప్టెంబర్ 28 ప్రత్యేకత,  సెంగోల్ అంటే ఏమిటి అనే అంశాల గురించి గూగులమ్మను నెటిజన్లు అడిగి తెలుసుకున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seven =