అంచనాలకు మించిన రీతిలో రేవంత్ రెడ్డి ఎంపికలు

Revanth Reddys Selections Exceeded Expectations,Revanth Reddys Selections,Selections Exceeded Expectations,Revanth reddy, CM Revanth reddy, Telangana CM, Revanth reddy Team, Telangana CMO,Mango News,Mango News Telugu,Revanth era in Telangana,Revanth Reddy will need to walk the talk,Revanth Reddy Latest News,Revanth Reddys Selections Latest Updates,Revanth Reddys Selections Live News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates
Revanth reddy, CM Revanth reddy, Telangana CM, Revanth reddy Team, Telangana CMO

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రతిదానిలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎంపిక చేసిన తన టీమ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముక్కుసూటిగా వ్యవహరించేవారు.. ఒత్తిళ్లకు, రాజకీయాలకు ఏమాత్రం లొంగని ఖతర్నాక్ టీమ్‌ను ఎంపిక చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఏ ఒక్కరిని కూడా వేలెత్తి చూపేందుకు అవకాశం లేని విధంగా టీమ్‌ను ఎంపిక చేసి తన దైన మార్క్‌ను చూపించారు.

టీమ్‌ను ఎంపిక చేసుకోవటంలో రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన తీరును అనుసరిస్తున్నారు. ఇన్నిరోజులు ప్రధాన్యతలేని పోస్టుల్లో కొనసాగుతున్న నిజాయితీగల ఆఫీసర్లను.. నిరాదరణకు గురైన సమర్థులను వెతికి మరీ వారికి అవకాశం కల్పిస్తున్నారు. సిన్సియారిటీకి పెద్దపీఠ వేస్తున్నారు. కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రాధాన్యత గల పోస్టులను కట్టబెడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు, పీఆర్వోలు, తన వ్యక్తిగత సిబ్బంది విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రేవంత్ రెడ్డి ఎంపిక చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని మూడు కమీషనరేట్లకు మంగళవారం రేవంత్ రెడ్డి ముగ్గురు కొత్త కమిషనర్లను నియమించారు. ఎటువంటి మచ్చలేని.. రాజకీయాలకు అస్సలు తలొగ్గని.. రూల్ బుక్‌ను మాత్రమే ఫాలో అయ్యే ఆఫీసర్లను హైదరాబాద్ మహానగరానికి బదిలీ చేశారు. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని.. రాచకొండ సీపీగా సుధీర్ బాబును.. సైబరాబాద్ సీపీగా అవినాష్ మొహంతీని నియమించారు. వారంతా రూల్ బుక్‌ను తూచా తప్పకుండా ఫాలో అయ్యేవారే తప్ప.. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గే వారు కాదు.

అలాగే తన పీఆర్వోల ఎంపిక విషయంలో కూడా రేవంత్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా తన పీఆర్వోగా జర్నలిస్ట్ అయోధ్య రెడ్డిని ఎంపిక చేశారు. అలాగే ఢిల్లీలో తన ప్రజాసంబంధ వ్యవహారాల్ని చూసుకునేందుకు విజయ్ అనే జర్నలిస్ట్‌కు అవకాశం కల్పించారు. ఇలా తన టీమ్ ఎంపిక విషయంలో తనదైన శైలిని అనుసరిస్తూ మార్క్ చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 8 =