ఒక్కటైన పిల్లి సుభాష్, తోట త్రిమూర్తులు..

Subash Chandra Bose and Thotaa Trimoorthulu, Thotaa Trimoorthulu and Subash Chandra Bose, Subash Chandra Bose, Thotaa Trimoorthulu , TDP, TDP,YCP,BJP, Janasena, Congress,Pawan Kalyan,Jagan, Chadra Babu, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Subash Chandra Bose, Thotaa Trimoorthulu , TDP, TDP,YCP,BJP, Janasena, Congress,Pawan Kalyan,Jagan, Chadra Babu

రాజకీయాలలో ఎన్నడూ చూడలేని చిత్రవిచిత్ర సన్నివేశాలన్నీ ఎన్నికల సమయంలోనే చూస్తూ ఉంటాము. తాజాగా అలాంటి సంఘటనే  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం రాజకీయాలలో కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉంటూ ఒకరిపై ఒకరు మాటల బాణాలు విసురుకునే  పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఒక్కటవ్వడం చర్చనీయాంశం అయింది.

పిల్లి సుభాష్ చంద్రబోస్ చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.  మరోవైపు తోట త్రిమూర్తులు టీడీపీలో పని చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో.. త్రిమూర్తులు వైసీపీ కండువా కప్పుకున్నారు.  అయినా కూడా వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో ఈ ఇద్దరు నేతలు పాత వైరాన్ని మనసులో పెట్టుకుని  విడివిడిగానే పాల్గొనేవారు.

కానీ ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ దగ్గర పడుతుండటంతో..వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ విజయం కోసం తామిద్దరం కలిసి పని చేస్తామని చెప్పడం హాట్ టాపిక్ అయింది. తమలాగే వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ కూడా పార్టీ గెలుపు కోసం కృష్టి చేయాలని వారిద్దరూ పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు అన్నారు. గతంలో తాము వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశామని… కొన్నిసార్లు  గెలిచామని, మరికొన్ని కొన్నిసార్లు ఓడిపోయామని గుర్తు చేశారు.  అయితే ఇప్పుడు  తామిద్దరం ఒకే పార్టీలో ఉండటమే కాకుండా..తమ ఇద్దరికీ కూడా సీఎం జగన్ పదవులు ఇచ్చారని చెప్పుకొచ్చారు . వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి  జగన్‌కు మరోసారి అధికారాన్ని ఇస్తామని తోట త్రిమూర్తులు అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 9 =