అక్కడ మూడుగా చీలిపోయిన జనసేన

There Is A Janasena That Is Split Into Three, Janasena Split Into Three, TDP, TDP,YCP,BJP, Janasena, Congress,Pawan Kalyan, Nagababu, Arani Srinivasulu, Tirupathi, chittoor, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
TDP, TDP,YCP,BJP, Janasena, Congress,Pawan Kalyan, Nagababu, Arani Srinivasulu, Tirupathi, chittoor

14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గా‎లతో పాటు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నాలుగు సిగ్మెంట్స్ ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేనలో ఎవరి దారి  వారిదే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని  తిరుపతి అసెంబ్లీ స్థానంలో జనసేన  అభ్యర్థి వ్యవహారం ఆ పార్టీలో విభేదాలకు కారణంగా మారింది. ఆరణి శ్రీనివాసులు స్థానికేతరుడన్న వాదనతో జనసేన రెండు గ్రూపులుగా విడిపోయింది.

తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఒక గ్రూపుగా ఉండగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ వర్గం మాత్రం మరో గ్రూపుగా విడిపోయింది. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు మద్దతును తెలుపుతూ పసుపులేటి హరిప్రసాద్ వర్గం ఉండటంతో.. తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ వర్గాన్ని పట్టించుకోకుండానే ఆరణి శ్రీనివాసులు ప్రచారానికి సిద్దం అంటున్నారు.

తిరుపతి జనసేన వ్యవహారం అధిష్టానం వద్ద పంచాయితీకి వెళ్లే పరిస్థితికి చేరుకోవడంతో.. జనసేన క్రమశిక్షణ సంఘం సభ్యులు అజయ్ కుమార్ మాట్లాడినా  కూడా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు  తిరుపతి జనసేన అభ్యర్థి అంశంపై ఆరణి శ్రీనివాసులుపై  వ్యతిరేకంగా ఉన్న జనసేన నేతలతో చర్చించిన నాగబాబు అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇదిలా జరుగుతుండగానే తాజాగా  శ్రీకాళహస్తి జనసేనలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ ఏకంగా మూడు గ్రూపులుగా విడిపోయి.. కూటమి అభ్యర్థికి ఇబ్బంది కలిగించేలా పరిస్థితి తయారయింది.

శ్రీకాళహస్తి ఇన్‎చార్జ్ కోటా వినూత ఒక వర్గంగా విడిపోగా.. కొట్టే సాయి మరోవర్గంగా.. అంజూరు చక్రధర్ మూడోవర్గంగా విడిపోయి  శ్రీకాళహస్తిలో జనసేన రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేశారు. టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ వెంట కొట్టే సాయి ఉండగా.. అసమ్మతి నేత మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడుకు అండగా కోటా వినుత ఉండగా మధ్యస్థంగా  అంజూరు చక్రధర్ ఉండటం పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది.

అలాగే  మదనపల్లిలోనూ  జనసేన మూడు గ్రూపులుగానే పనిచేస్తోంది. జనసేన రాయలసీమ కో కన్వీనర్ గా రాందాస్ చౌదరి ఒక వర్గంగా, మై ఫోర్స్ మహేష్ మరో వర్గంగా, మూడో వర్గంగా జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత, రామాంజనేయులు విడిపోయి..ఏకంగా మూడు పార్టీ ఆఫీసులతో హడావుడి చేస్తున్నారు.  దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =