ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్ నజీర్ నియామకం

Supreme Court Retired Judge Justice S Abdul Nazeer Appointed As New Governor of Andhra Pradesh,Supreme Court Retired Judge,Justice S Abdul Nazeer,New Governor of Andhra Pradesh,Mango News,Mango News Telugu,S Abdul Nazeer Andhra Pradesh Governor,Andhra Pradesh Governor S Abdul Nazeer,Abdul Nazeer Sahab,Supreme Court Judge S. Abdul Nazeer,Supreme Court Judge Abdul Nazeer,S Abdul Nazeer Speech,Justice S Abdul Nazeer And Krishna Murari,Justice S Abdul Nazeer,Hon’Ble Mr. Justice S.Abdul Nazeer,Abdul Nazeer Sab Wikipedia,Abdul Nazeer Sab

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్ నజీర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి గవర్నర్ గా బదిలీ చేశారు. కాగా ఏపీ నూతన గవర్నర్ గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రామ జన్మభూమి, డిమోనిటైజేషన్ రద్దు, త్రిపుల్‌ తలాక్‌ పలు కీలక కేసులను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు. 2023, జనవరి 4వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పదవి విరమణ పొందారు. సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్‌ పి.సదాశివం తర్వాత, గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న రెండోవ్యక్తిగా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నిలిచారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయనిపుణులైన జస్టిస్‌ నజీర్‌ అనుభవం ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయడంలోనూ, రాష్ట్రానికి చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ఉపయోగపడుతుందని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + nineteen =