మహిళల టీ20 ప్రపంచ కప్‌: ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం.. రాణించిన జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్

Women's T20 World Cup Jemimah Rodrigues and Richa Ghosh Set up Record Win of India Over Pakistan,Pak Women Cricket Team,Pakistan Vs India,Pakistan Cricket Match,India Vs Pakistan Head To Head,Ind Vs Pak Women'S World Cup,Ind Vs Pak Women'S Live Score,Ind Vs Pak Women'S Live Score Today,Ind Vs Pak Women'S T20,Ind Vs Pak Women'S World Cup 2022 Score,Ind Vs Pak Women'S World Cup 2022 Schedule,Ind Vs Pak Women'S T20 2022,Ind Vs Pak Women'S Asia Cup 2022,Ind Vs Pak Women'S World Cup 2022 Highlights,Ind Vs Pak Women'S World Cup Scorecard,Ind Vs Pak Women'S,India Vs Pak Women'S World Cup 2022,India Vs Pak Women'S World Cup,India Vs Pak Women'S Live Score,India Vs Pak Women'S World Cup 2022 Live Score

టీ20 ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు బోణీ చేసింది. గ్రూప్‌-బిలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్లతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌ హాఫ్ సెంచ‌రీతో రాణించ‌గా.. షెఫాలీ వ‌ర్మ‌, రిచా ఘోష్ మెరుపులు మెరిపించడంతో టీమిండియా మ‌రో ఓవ‌ర్ మిగిలుండ‌గానే అద్భుత విజ‌యం సాధించింది. ఇక ఈ విజయం ద్వారా టీ20 వరల్డ్‌ కప్‌లో 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా భారత్‌ నిలిచింది. అంతకుముందు 2009లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ 164 పరుగుల టార్గెట్‌ను ఛేదించింది. కాగా టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్‌ బిస్మా మారూఫ్‌ (68 నాటౌట్‌), అయేషా నసీమ్‌ (43 నాటౌట్‌) రాణించడంతో 20 ఓవర్లలో 149/4 స్కోరు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ 2 వికెట్లు తీయగా.. దీప్తి, పూజా ఒక్కో వికెట్ ద‌క్కించుకున్నారు.

అనంతరం 150 ప‌రుగుల విజయ ల‌క్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఓపెన‌ర్లు యాస్తికా భాటియా (17 పరుగులు) , ఫెషాలీ వ‌ర్మ (33 పరుగులు) తొలి వికెట్‌కు 38 ప‌రుగులు జోడించి చ‌క్క‌టి ఆరంభాన్ని అందించారు. భాటియా ఔటయ్యాక క్రీజులోకొచ్చిన రోడ్రిగ్స్‌.. షఫాలీతో కలసి రెండో వికెట్‌కు 27, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ (16)తో కలసి మూడో వికెట్‌కు 28 రన్స్‌ భాగస్వామ్యంతో జట్టును నడిపించింది. ఈ క్రమంలో 14 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 95/3తో నిలిచింది. అయితే రన్‌రేట్‌ పెరుగుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్‌ బౌండ్రీలతో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. 18వ ఓవర్‌లో ఐమన్‌ బౌలింగ్‌లో రిచా హ్యాట్రిక్‌ ఫోర్లలతో మొత్తం 14 రన్స్‌ రాబట్టడంతో.. భారత లక్ష్యం 12 బంతుల్లో 14 పరుగులకు చేరుకుంది. ఈ క్రమంలో 19వ ఓవర్‌లో మూడు ఫోర్లతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చిన జెమీమా అర్ధ శతకాన్ని పూర్తి చేసుకుంది. పాక్ బౌలర్లలో నష్రా సంధూ 2 వికెట్లు దక్కించుకుంది. భారత బ్యాటింగ్‌లో వెన్నెముకగా నిలిచిన రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. కాగా ప్రపంచ కప్‌లో భారత్‌ తన రెండో మ్యాచ్‌లో బుధవారం వెస్టిండీస్‌తో తలపడనుంది.

స్కోరు బోర్డు

పాకిస్థాన్‌: మునీబా అలీ (స్టంప్డ్‌) రిచా (బి) రాధా యాదవ్‌ 12, జవేరియా (సి) హర్మన్‌ప్రీత్‌ (బి) దీప్తి 8, బిస్మా మరూఫ్‌ (నాటౌట్‌) 68, నిదా దర్‌ (సి) రిచా (బి) పూజ 0, సిద్రా అమీన్‌ (సి) రిచా (బి) రాధా యాదవ్‌ 11, ఆయేషా నసీమ్‌ (నాటౌట్‌) 43, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 149/4.

బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 3-0-24-0, దీప్తి శర్మ 4-0-39-1, రాజేశ్వరి 4-0-31-0, రాధా యాదవ్‌ 4-0-21-2, పూజ వస్ర్తాకర్‌ 4-0-30-1, షఫాలీ వర్మ 1-0-3-0.

భారత్‌: యాస్తిక భాటియా (సి) ఫాతిమా సనా (బి) సాదియా ఇక్బాల్‌ 17, షఫాలీ వర్మ (సి) సిద్రా అమీన్‌ (బి) నష్రా సంధూ 33, జెమీమా రోడ్రిగ్స్‌ (నాటౌట్‌) 53, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) బిస్మా (బి) నష్రా సంధూ 16, రిచా ఘోష్‌ (నాటౌట్‌) 31, ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 19 ఓవర్లలో 151/3.

బౌలింగ్‌: ఫాతిమా సనా 4-0-42-0, సాదియా ఇక్బాల్‌ 4-0-25-1, ఐమన్‌ అన్వర్‌ 3-0-33-0, నిదా దర్‌ 4-0-36-0, నష్రా సంధూ 4-0-15-2.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + seventeen =