ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ సభలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu Unfurls National Flag in Azadi Ka Amrit Mahotsav Celebrations at Guntur, Chandrababu Naidu Unfurls National Flag in Azadi Ka Amrit Mahotsav Celebrations at Guntur, Azadi Ka Amrit Mahotsav Celebrations at Guntur, TDP Chief Chandrababu Naidu, Azadi Ka Amrit Mahotsav Celebrations, 76th Independence Day, Independence Day, Azadi Ka Amrit Mahotsav Celebrations News, Azadi Ka Amrit Mahotsav Celebrations Latest News And Updates, Azadi Ka Amrit Mahotsav Celebrations Live Updates, Mango News, Mango News Telugu,

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా, చేబ్రోలులో సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సహా పలువురు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జనం మధ్యలో చేయాలనే తలంపుతో ఇక్కడ ఏర్పాటు చేశామని తెలిపారు. మహత్మా గాంధీ చేసిన పోరాటం ప్రపంచానికి స్ఫూర్తి అని, అలాగే డా. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మనకు ఆదర్శమని పేర్కొన్నారు. నాటి తొలి ప్రధానమంత్రి నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోదీ వరకు దేశం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తున్నారని చంద్రబాబు నాయుడు కొనియాడారు.

ప్రధానిగా ఉన్నప్పుడు పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు మన దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా చేశాయని, అలాగే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు ధీటుగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఇక ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుని స్మరించుకోవాలని పేర్కొన్న చంద్రబాబు, పేద ప్రజలకు మేలు చేయటం కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. దేశ సమైక్యత విషయంలో టీడీపీ ఎప్పుడు ముందుంటుందని తెలిపిన ఆయన టెలీ కమ్యూనికేషన్ రంగంలో మార్పులకు టీడీపీ నాంది పలికిందని గుర్తు చేశారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు మన వాళ్లే సీఈవోలుగా ఉన్నారని, ఈ సందర్భంగా జన్మభూమి అభివృద్ధి కోసం ప్రవాసులు కృషి చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − six =