ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Pays Tribute to NTR on his 27th Death Anniversary,TDP Chief Chandrababu,Chandrababu Pays Tribute to NTR,NTR 27th Death Anniversary,Mango News,Mango News Telugu,AP CM NTR,Ntr Death Reason,Sr Ntr Age,Sr Ntr Sons And Daughters,N T Rama Rao Children,Ntr Full Name,N T Rama Rao Previous Offices,Ntr Daughters Names,Sr Ntr Family Tree,N. T. Rama Rao Children,Sr Ntr Death Anniversary,Ntr Death Date,Ntr Brothers,Ntr Children,Ntr Senior,Ntr Family,Ntr Childrens Names,Ntr Father

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు 27వ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. చంద్రబాబు ట్వీట్ చేస్తూ, “మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడు ఎన్టీఆర్. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా, జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. రాజకీయాల్లో మహిళల, బడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని అందించేందుకు, మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో సమసమాజ స్థాపనకు బాటలు వేసిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనందరం కృషిచేద్దాం” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here