టూల్‌కిట్ రూపొందించడంలో వారిదే కీలక పాత్ర : ఢిల్లీ పోలీసులు

Delhi Police, Disha Ravi, Disha Ravi and her Colleagues Created Tool Kit, Disha Ravi panicked when Greta Thunberg leaked toolkit, Disha Ravi sent toolkit to Greta Thunberg, Disha Ravi Toolkit case, Disha Ravi Toolkit case News, Mango News, Nikita Jacob, Shantanu, Toolkit case, Toolkit case. Greta Thunberg was coaxed by Disha Ravi

పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ‘టూల్‌కిట్‌’ కేసు దర్యాప్తులో భాగంగా బెంగళూరుకు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు దిశ రవిని ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. క్రిమినల్ కుట్ర, దేశద్రోహం కింద ఆమెను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అలాగే ఈ కేసుకు సంబంధించి సామాజిక కార్యకర్తలయిన నికితా జాకబ్‌, శంతనులపై కూడా సోమవారం నాడు నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ అయింది. గ్రెటా థన్‌బెర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ లో దేశంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనకు సంబంధించిన విషయాలను పొందుపరిచారు. అయితే దిశా రవి అరెస్ట్ పై కొన్ని పొలిటికల్ పార్టీలు, రైతు సంఘాలు, పలు ప్రాంతాల్లో సామాజిక కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ, ఆమెను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

ఈ టూల్‌కిట్‌ (డాక్యుమెంట్) ను రూపొందించడంలో దిశ రవితో పాటుగా నికితా జాకబ్‌, శంతనులే ప్రధాన సూత్రధారులని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ టూల్‌కిట్‌ ను వీరే గ్రెటా థన్‌బర్గ్‌ కు షేర్ చేశారని పేర్కొన్నారు. ఈ టూల్‌కిట్‌ ను ఇతరులకు చేరవేసేందుకు దిశరవి ఓ వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేసిందని, టూల్ కిట్ ఎడిట్‌ చేసిన వారిలో నికితా జాకబ్‌ ఉన్నారని చెప్పారు. అలాగే జనవరి 26 కు ముందు ఖలిస్థాన్‌ గ్రూపుకు చెందిన పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన జూమ్‌ మీటింగ్‌లో కూడా వీరు పాల్గొన్నట్టు తెలిపారు. ఇక దేశద్రోహం ఆరోపణలతో అరెస్టు అయిన దిశా రవిని న్యాయమూర్తి ఆదేశాలతో ఐదురోజుల పోలీసు కస్టడీకి తరలించి విచారణ చేస్తున్నారు. అలాగే అరెస్ట్ వారెంటు అనంతరం నికితా జాకబ్‌ అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు దిశా రవి అరెస్ట్ పై బెంగుళూరు నగరంలో సామాజిక కార్యకర్తలు నిరసన కొనసాగిస్తున్నారు. ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + seventeen =