ప్రజలు నిర్లక్యం వీడకపోతే మరోక లాక్‌డౌన్‌ వైపు వెళ్లాల్సి రావొచ్చు

coronavirus news, Lockdown, Maharashtra Lockdown News, Mango News, Mumbai Coronavirus, Mumbai Coronavirus News, Mumbai Lockdown News, Mumbai Mayor, Mumbai mayor Kishori Pednekar, Mumbai Mayor warns of another lockdown, Mumbai Mayor warns over surge in coronavirus, Mumbai Mayor Warns People over Surge in Covid Cases, News updates from HT, Surge in Covid Cases

దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. అయితే మహారాష్ట్ర రాష్ట్రంలో మాత్రం మళ్ళీ పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో‌ కేసులు మళ్లీ పెరుగుతున్న ఈ నేపథ్యంలో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) మేయ‌ర్ కిషోరీ ప‌డ్నాక‌ర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ముంబయి ప్రజలంతా కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.

“కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ప్రజలు నిర్లక్ష్యం వీడి, పరిస్థితి మెరుగుపడకపోతే ముంబయి నగరం మరోక లాక్‌డౌన్‌ వైపుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి వస్తుంది. లోకల్ ట్రైన్స్ లో చాలామంది ప్రజలు మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోక లాక్‌డౌన్‌ వైపు వెళ్లకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మ‌ళ్లీ లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌స్తుందా, లేదా అనే విషయం ప్ర‌జ‌ల చేతుల్లోనే ఉంది” అని మేయ‌ర్ కిషోరీ ప‌డ్నాక‌ర్ వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 1 నుంచి సాధారణ ప్రజలకు కూడా ముంబయి లోకల్ ట్రైన్స్ లో అనుమతి ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసులలో ఆకస్మిక పెరుగుదల చోటుచేసుకోవడంతో ఇతర అంశాలతో పాటుగా లోకల్ ట్రైన్స్ పై కూడా దృష్టి సారిస్తున్నారు. లోకల్ ట్రైన్స్ లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 10 =