మే 27న ప్రారంభం కానున్న ‘మహానాడు’ వేడుకలు.. ఈసారి ఒంగోలులో ఏర్పాటుకు టీడీపీ నిర్ణయం

TDP Decide To Hold Mahanadu Celebrations This Year in Ongole From May 27, TDP Mahanadu Celebrations In Ongole, Telugu Desam Party has a rich tradition of holding grand Mahanadu events, TDP Mahanadu Celebrations will be organised in Ongole from May 27 to 29, TDP Mahanadu Celebrations will be organised in Ongole, Chandrababu Naidu has declared that Mahanadu party's annual conclave will be held in Ongole this year from May 27-29, TDP Mahanadu Celebrations will Start From May 27, TDP Mahanadu Celebrations will End On May 29, TDP partys annual conclave, TDP partys annual conclave will be held in Ongole this year from May 27-29, Telugu Desam Party president Nara Chandrababu Naidu, TDP president Nara Chandrababu Naidu, Telugu Desham Party, Telugu Desham Party Chief Nara Chandrababu Naidu, TDP Chief Nara Chandrababu Naidu, Nara Chandrababu Naidu, Chandrababu Naidu, TDP Mahanadu Celebrations, TDP Mahanadu Celebrations News, TDP Mahanadu Celebrations Latest News, TDP Mahanadu Celebrations Latest Updates, Mango News, Mango News Telugu,

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈసారి ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడును నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అయితే మే 27న ప్రారంభం కానున్న మహానాడు కార్యక్రమం ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై పొలిట్ బ్యూరోలో చర్చించి టీడీపీ అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. మహానాడులో భాగంగా జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నియామకాన్ని జాతీయ అధ్యక్షుడు ఖరారు చేస్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా మే నెల 27-29 వరకు మహానాడు వేడుకలు నిర్వహించటం పార్టీ ఒక ఆనవాయితీగా పాటిస్తోంది.

తెలుగుదేశం పార్టీ విధి విధానాలపై మరియు పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ మూడు రోజులూ చర్చ జరుపుతారు. పార్టీలో అంతర్గతంగా పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. కాగా గడచిన రెండు, మూడేళ్ళుగా మహానాడు నిర్వహణ కుదరలేదు. ఒక ఏడాది ఎన్నికల కారణంగా నిర్వహించలేకపోగా, తరువాతి రెండు సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి కారణంగా జరగలేదు. దీంతో ఈసారి కార్యక్రమాన్ని భారీగా నిర్వహించటానికి పార్టీ ఏర్పాట్లు చేయనుంది. ఏర్పాట్లకు సంబంధించి పలు కమిటీలను వేయనున్నట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడుపై చర్చించటానికి త్వరలోనే పొలిట్ బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =