తెలంగాణలో వ్య‌వ‌సాయ రంగంపై ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వహించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

CM KCR Holds High Level Review Meet on Agriculture Sector in Telangana, Telangana CM KCR Holds High Level Review Meet on Agriculture Sector in Telangana, CM KCR Holds High Level Review Meet on Agriculture Sector, Agriculture Sector in Telangana, High Level Review Meet on Agriculture Sector in Telangana, Review Meet on Agriculture Sector, Agriculture Sector, Telangana Agriculture Sector, Telangana Agriculture Sector News, Telangana Agriculture Sector Latest News, Telangana Agriculture Sector Latest Updates, Telangana Agriculture Sector Live Updates, Telangana CM KCR, K Chandrashekar Rao, Chief minister of Telangana, K Chandrashekar Rao Chief minister of Telangana, Telangana Chief minister, Telangana Chief minister K Chandrashekar Rao, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగంపై ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ వేదికగా జ‌రిగిన ఈ స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వ‌రి ధాన్యం సేక‌ర‌ణకు ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొనుగోళ్ల తీరుతెన్నులని అడిగి తెలుసుకున్నారు. అలాగే ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.

సమీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించారు. రైతుల జీవితాలను దుర్భరం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలు, చర్యల వెనుక లోతైన కుట్ర దాగి ఉందని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లను అమర్చడం, వ్యవసాయ రంగానికి ఎన్‌ఆర్‌ఇజిఎను అనుసంధానం చేయకపోవడం వంటి రైతు వ్యతిరేక విధానాల వలన రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతులను సొంత భూమిలో కూలీలుగా మార్చే చర్యలను అందరూ వ్యతిరేకించాలని అన్నారు. అలాగే ఎరువుల ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులతో చర్చించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =