రఘురామ కృష్ణంరాజుకు టీడీపీ-జనసేన బిగ్ షాక్

TDP Janasena big shock for Raghurama Krishnamraj,TDP Janasena big shock,big shock for Raghurama Krishnamraj,Raghurama Krishnamraj,TDP, Janasena, Raghurama Krishnamraj, Chadrababu, pawan kalyan,Mango News,Mango News Telugu,AP High Court Give Big Shock,Raghu Rama Krishnam Raju Reveals,Raghurama Krishnamraj Latest News,Raghurama Krishnamraj Live Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
TDP, Janasena, Raghurama Krishnamraj, Chadrababu, pawan kalyan

ఎన్నికలవేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ దక్కకపోవడంతో పెద్ద ఎత్తున నేతలు వేరే పార్టీలను చూసుకుంటున్నారు. ఇప్పటికే టికెట్ దక్కకపోవడంతో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. మరికొందరు కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అటు టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు. ఇలా నేతలు పార్టీలు మారుతుండడంతో ఏపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి.

ఇదిలా ఉండగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు దిమ్మతిరిగే షాక్ తగిలినట్లు తెలుస్తోంది.. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన రాఘరామ కృష్ణంరాజు.. ప్రస్తుతం టీడీపీ-జనసేన కూటమికి మద్ధతుగా ఉన్నారు. వైసీపీ హైకమాండ్‌తో పొసగకపోవడంతో.. ఆయన పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు కొద్దిరోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా కొన్నిసార్లు వైసీపీ అధినేత జగన్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో హెడ్‌లైన్స్‌లో నిలిచారు.

అయితే అప్పట్లోనే రఘురామ పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బీజేపీలోకి వెళ్తారని గుసగుసలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో అది జరగలేదు. ప్రస్తుతం ఆయన జనసేన-టీడీపీ కూటమికి దగ్గరగా ఉన్నారు. ఈక్రమంలో ఆ కూటమి తరుపున ఉమ్మడి అభ్యర్థిగా రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తారని కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరగుతోంది. అటు రఘురామ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తనకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నారు. అందేకే ఆ కూటమి గెలుపుకోసం రఘురామ కృషి చేస్తున్నారు.

ఇప్పుడు రఘురామకు షాక్ తగిలినట్లు సమాచారం. టీడీపీ, జనసేన పార్టీలు రఘురామకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాయట. సర్వే ఫలితాలు కూడా రఘురామకు వ్యతిరేకంగా రావడంతో.. ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కూటమి నిరాకరించిందట. అటు బీజేపీ టికెట్ కోసం రఘురామ ప్రయత్నించినప్పటికీ.. అక్కడ కూడా ఆయనకు షాక్ తగిలిందట. బీజేపీ హైకమాండ్ కూడా రఘురామకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిందట. మొండి చేయి చూపించిందట. మరి ఇప్పుడు రఘురామ ఏం చేస్తారు..? ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =