కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్ ఆంక్షలు

Traffic Alert For Hyderabadis,Traffic Alert,Alert For Hyderabadis,Traffic Alert For Hyderabad, Kite And Sweet Festival Restrictions,Kite And Sweet Festival,Hyderabadi Traffic,Hyderabad Traffic News For Today,Real Time Road Traffic,Latest News On Hyderabad Traffic,Toll Plazas On Hyderabad,Hyderabad Vijayawada National Highway,Sankranti Festival 2024,Telangana Latest News And Updates,Hyderabad News
Traffic alert for Hyderabadis, Kite and Sweet Festival restrictions,Kite and Sweet Festival,Traffic alert

హైదరాబాద్‌‌లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పోలీసులు ట్రాఫిక్‌ అలర్ట్‌ ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్-2004 కోసం హైదరాబాద్‌లని కొన్ని చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని పోలీసులు చెప్పారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయని తెలిపారు.

జనవరి 13  నుంచి జనవరి 15  వరకు పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్ చెప్పారు. వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను ముందుగానే గమనించాలని అన్నారు.  ఆ రూట్లలో కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుని ప్రయాణించాలని సూచించారు.

మెయిన్‌గా తివోలి క్రాస్‌ రోడ్డు నుంచి  పీపుల్ ప్లాజా ఎక్స్‌ రోడ్డు వరకు ఉన్న రోడ్డును పూర్తిగా మూసేయనున్నట్టు  విశ్వప్రసాద్ వెల్లడించారు. ఆంక్షలు అమల్లో ఉన్న ఆయా రూట్లలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని  తెలిపారు. అలుగడ్డబావి ఎక్స్‌ రోడ్స్‌,  వైఎంసీఏ జంక్షన్, ప్యాట్నీ,  స్వీకార్‌ ఉపకార్‌ జంక్షన్స్, ఎస్‌బీహెచ్‌,  సీటీవో, సంగీత, బ్రూక్‌ బాండ్‌, తివోలి, సికింద్రాబాద్‌ క్లబ్‌, తాడ్‌ బంద్‌, రసూల్‌పురా, బేగంపేట్‌, సెంటర్‌ పాయింట్‌, డైమండ్‌ పాయింట్‌, బోయిన్‌పల్లి ఎక్స్‌ రోడ్స్‌,  పారడైజ్‌ రూట్లలో  ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని సీపీ విశ్వ ప్రసాద్‌ తెలిపారు.

కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ ను తిలకించడానికి హైదరాబాదీలు తమ  సొంత వాహనాలకు బదులు.. మెట్రో రైలుసర్వీస్‌ లను ఉపయోగించుకోవాలని సిటీ ట్రాఫిక్ అదనపు సీపీ కోరారు. దీనివల్ల సందర్శకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు.ఒకవేళ సొంత వెహికల్స్‌తో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కోసం పరేడ్‌ గ్రౌండ్‌ కు వచ్చేవాళ్లు.. కేవలం వారికి కేటాయించిన పార్కింగ్‌ స్థలాల్లోనే తమ వాహనాలను పార్క్‌ చేయాలని సీపీ విశ్వప్రసాద్‌ చెప్పారు. హైదరాబాద్ ప్రజలు తమకు సహకరించాలని, రూట్లు మళ్లింపును ముందుగానే గమనించి వేరే మార్గాల ద్వారా ప్రయాణాలు సాగించాలని విశ్వప్రసాద్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − twelve =