హిందూపురంలో గతంలో చదివిన విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారు – ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

TDP MLA Nandamuri Balakrishna Distributes Rs 45000 Worth of 30 LED TVs To Govt Schools in Hindupur, Balakrishna Distributes Rs 45000 Worth of 30 LED TVs To Govt Schools in Hindupur, 0 LED TVs To Govt Schools in Hindupur, Hindupur Govt Schools, TDP MLA Nandamuri Balakrishna, MLA Nandamuri Balakrishna, Nandamuri Balakrishna, Hindupur, Balakrishna, Hindupur Govt Schools News, Hindupur Govt Schools Latest News And Updates, Hindupur Govt Schools Live Updates, Mango News, Mango News Telugu,

హిందూపురంలో గతంలో చదివిన విద్యార్థిని, విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హిందూపురం పర్యటనలో భాగంగా ఆయన గురువారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని కొట్నూరు ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలో హిందూపురం నియోజకవర్గం లోని లేపాక్షి చిలమత్తూరు, హిందూపురం చెందిన ప్రభుత్వ పాఠశాలలకు హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో 4 లక్షల 50 వేల విలువచేసే 30 ఎల్ఈడి టీవీలను ఎమ్మెల్యే బాలకృష్ణ ఉచితంగా పంపిణీ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హిందూపురంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేలా పలు విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని వివరించారు. వీటిలో అంధుల పాఠశాల, నవోదయ విద్యాసంస్థ వంటివి ఉన్నాయని బాలకృష్ణ వెల్లడించారు. ఇక విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే మంచి సందేశాన్నిచ్చే సినిమాలను చూడండని సలహా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యం అని, ఈరోజు రాష్ట్రంలో రోడ్లు అధ్వానం స్థితిలో ఉంటే చివరకు గుంతలు కూడా పూడ్చటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఎండలో కొద్దిసేపు ఉంటే అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుందని తెలిపిన బాలకృష్ణ, తాను ఎండలో తిరిగితే ప్రభుత్వానికి మాత్రం బాదుడే బాదుడు అని వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =