మేమూ యాదాద్రి అక్షింతలు పంచివుంటే గెలిచే వాళ్లమేమో: కేటీఆర్

If We Share Our Horizons We Will Win Says Ktr,If We Share Our Horizons,We Will Win,Ktr Says We Will Win,KTR, KTR Comments, Kavitha, BJP, BRS, Congress,Mango News,Mango News Telugu,Missed the mark,Kalvakuntla Taraka Rama Rao,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Ktr Latest News
KTR, KTR Comments, Kavitha, BJP, BRS, Congress

మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పావులు కదుపుతున్నాయి. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బీఆర్ఎస్ వెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్‌ బీజేపీకి బీ టీమ్ కాబట్టే లిక్కర్ స్కామ్ కేసులో షర్మిలను అరెస్ట్ కాలేదని ఆరోపణలు చేస్తోంది.

ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే షర్మిల అరెస్ట్ కాకపోవడం వెనుకున్న అసలు కారణాలను వెల్లడించారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కావడం అనేది ఇప్పుడే కాదు.. ఎప్పటికీ జరగదని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అయితే.. కవిత మీద కేసు పెట్టేవారా..? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం వల్లే కవిత అరెస్ట్ కాలేదని తేల్చి చెప్పారు. బీజేపీతో సంబంధం ఉండడం వల్లే కవిత అరెస్ట్ కాలేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదన్న కేటీఆర్.. కాంగ్రెస్ బీ టీమ్ అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజపీలు కుమ్మక్కై బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కు కారణంగానే రెండు ఎమ్మెల్సీల ఉప ఎన్నికల్ని వేర్వేరుగా నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసినాకే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విధానం మారిందని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యవతిరేక వైఖరుల్ని ఎప్పటికప్పుడు ఎండగడతానని వెల్లడించారు. బీజేపీ మతాన్ని రోజకీయం కోసం వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నేతలు రాజకీయంగా హిందువులు అయితే.. కేసీఆర్ మతాన్ని మతంగా మాత్రమే చూసే హిందువని పేర్కొన్నారు. తాము కూడా యాదాద్రి అక్షింతలను పంచితే గెలిచే వాళ్లమేమేనని విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =