‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్న టాలీవుడ్ హీరో రామ్‌చరణ్.. ఈ గౌరవం అందుకున్న తొలి తెలుగు నటుడిగా ఘనత

Tollywood Hero Ram Charan Becomes The First Telugu Actor Who Participated in Good Morning America Show, Tollywood Hero Ram Charan, First Telugu Actor Ram Charan, Ram Charan Good Morning America Show, First Telugu Actor in Good Morning America Show, Mango News, Mango News Telugu, Gma Website,Abc Good Morning America Show Today,Good Morning America Hosts,Good Morning America Live App,Good Morning America Presented By,Good Morning America Scandal,Good Morning America Show Cast,Good Morning America Show Guests Today,Good Morning America Show Hosts,Good Morning America Show Tickets,Good Morning America Show Tickets New York,Good Morning America Show Time,Good Morning America Show Today Episode Guide,Good Morning America Shows,Good Morning America Today'S Show,Past Good Morning America Show Hosts,Ram Charan Business,Ram Charan Father,Ram Charan Mother,Ram Charan Wife Name,Ram Charan Wikipedia

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశంలోనే కాక అంతర్జాతీయంగా సంచలనం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గతేడాది మార్చిలో విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో కూడా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో రామ్‌చరణ్ శుక్రవారం (ఫిబ్రవరి 24) జరుగనున్న ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు’ ప్రదానోత్సవంలో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లారు. ఇదే క్రమంలో అమెరికాలోని ప్రముఖ ఛానెల్ ఏబీసీలో వచ్చే ప్రతిష్టాత్మకమైన టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్ఆర్ సినిమా అనేది రెండు పాత్రల మధ్య ఉన్న ఒక స్నేహం మరియు అద్భుతమైన సోదర భావం గురించి గొప్పగా చెప్పింది. మా డైరెక్టర్ రాజమౌళి తీసిన గొప్ప సినిమాల్లో ఇదీ ఒకటి. అందుకే ఆయనను ఇండియా స్టీవెన్ స్పీల్‌బర్గ్ అంటారు. రాజమౌళి త్వరలోనే గ్లోబల్ సినిమాలోకి వస్తాడని ఆశిస్తున్నా. ఇండియా ఫిల్మ్ మేకింగ్ గొప్పతనమేంటో ‘నాటు నాటు’ పాట చిత్రీకరణతో తెలిసిందని, అసలు ఈ గుర్తింపు ఎప్పుడో రావాల్సింది’ అని చెప్పాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నాకు రిహానా, లేడీ గాగా, టాప్ గన్ మ్యావెరిక్ పాటలన్నీ బాగా నచ్చాయి. అయితే ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవం. 85 ఏళ్లకు పైన చరిత్ర ఉన్న ఇండియన్ సినిమాకు తొలిసారి దక్కిన అవార్డు. అకాడెమీ గుర్తించింది, అలాగే గోల్డెన్ గ్లోబ్స్ గుర్తించింది. ఇంకా ఇతర అవార్డులు కూడా వచ్చాయి. ఇది కేవలంఒక్క ‘ఆర్ఆర్ఆర్’ కే కాదు, మొత్తం ఇండియన్ సినిమా, ఇండియన్ టెక్నీషియన్లకు దక్కిన గౌరవం’ అని రామ్‌చరణ్ పేర్కొన్నాడు.

గ్రే బ్లేజర్, మ్యాచింగ్ ట్రౌజర్, బ్రౌన్ షూస్, సన్ గ్లాసెస్ ధరించి సూపర్ స్టైలిష్ లుక్ లో షోకు హాజరైన రామ్‌చరణ్ ఏబీసీ స్టూడియోలో సందడి చేశాడు. ఇక ఈ టాక్ షోలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు అమెరికాలో అభిమానులకు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ రామ్‌చరణ్ తో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇక తన అమెరికా పర్యటనలో భాగంగా రామ్‌చరణ్ అనేక ప్రచార కార్యక్రమాలు మరియు ప్రదర్శనలకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా రామ్‌చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న బహుభాషా చిత్రం పనులలో బిజీగా ఉన్నాడు. తద్వారా ఈ షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా ఘనత అందుకున్నారు. ఇక అంతకుముందు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పలుసార్లు ఈ షోలో కనిపించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − six =