తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బీఎంఎస్‌ రూ.800 కోట్లతో కంపెనీ ఏర్పాటు

Minister KTR Announces Global Pharmaceutical Giant Bristol Myers Squibb To Invest USD 100 Million in Hyderabad, Minister KTR Announcement, Bristol Myers Squibb, Bristol Myers Squibb Invest USD 100 Million, Bristol Myers Squibb Hyderabad, Mango News, Mango News Telugu,Recent Investments In Telangana,Davos Telangana Investment,Fdi In Telangana 2023,Invest Telangana Careers,Investment Subsidy Telangana,New Investments In Hyderabad 2023,Telangana Ev Investment,Telangana Industrial Investment Promotion Policy,Telangana Investment,Telangana Investment Companies,Telangana Investment News,Telangana Investment Opportunities,Telangana Investment Promotion Agency,Telangana Investment Summit,Telangana New Investments

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఇప్పటికే ఎన్నో ఐటీ మరియు ఇతర సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ‘బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్’ (బీఎంఎస్‌) కంపెనీ హైదరాబాద్‌లో 100 మిలియన్ డాలర్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఎంఎస్‌, తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని గురించి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇలా ప్రకటించారు.. ‘గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ 100 మిలియన్ USD పెట్టుబడితో హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది. తెలంగాణలో ప్రతిపాదిత సౌకర్యంతో దాదాపు 1,500 మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది’ అని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని టాప్‌ టెన్‌ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో బీఎంఎస్‌ ఒకటి అని, తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌ నగరం బయోటెక్నాలజీ మరియు ఐటీ రంగాలకు గొప్ప గమ్య స్థానంగా నిలుస్తోందని, బీఎంఎస్‌ కూడా ఈ రెండు రంగాలలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఇక హైదరాబాద్‌ నగరంలో ఉన్న మానవ వనరులను బీఎంఎస్‌ సంస్థ సమర్ధవంతంగా వినియోగించుకుంటుందని భావిస్తున్నానని, అలాగే 2028 నాటికి రాష్ట్రంలోని లైఫ్‌ సైన్సెస్‌ ఈకో సిస్టం విలువను రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో భాగంగానే నేడు బీఎంఎస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. అంతకుముందు బీఎంఎస్‌ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరం ఇటీవలి కాలంలో మౌలిక వసతుల విషయంలో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని పేర్కొనాన్రు. ఇక హైదరాబాద్‌లో ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాల నిర్వహణకు 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిని పెడుతున్నామని, రానున్న మూడు సంవత్సరాల్లో తమ కంపెనీ దాదాపు 1500 మంది ఉద్యోగులను నియమించుకుంటుందని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =