కరోనాపై పోరుకు అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల విరాళం

Allu Arjun, Allu Arjun COVID 19, Allu Arjun Donates 1.25 Cr, Allu Arjun Donates 1.25 Cr to Three States, Allu Arjun Donations For Coronavirus, Andhra Pradesh, coronavirus india, coronavirus news, Coronavirus outbreak, Coronavirus Total Cases, Coronavirus Update, Fight against coronavirus, Kerala, telangana

దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 27, శుక్రవారం నాటికీ దేశంలో 753 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 45, ఆంధ్రప్రదేశ్ లో 12 నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వంతో పాటుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పాటుగా పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పై పోరాటం చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నానికి పలువురు ప్రముఖులు సహకారం అందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు అల్లు అర్జున్‌ రూ.1.25 కోట్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలకు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఒక స్పెషల్‌ వీడియోను పోస్ట్ చేశారు. “కరోనా మహమ్మారి చాలా మంది జీవితాలను దెబ్బతీస్తుంది ఈ ప్రతికూల సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్ర ప్రజలకు నేను ఒక కోటి ఇరవై ఐదు లక్షలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. మనమంతా కలిసి ఈ మహమ్మారిపై పోరాడి, త్వరలోనే అంతం చేస్తామని ఆశాభావంతో ఉన్నానని” అల్లు అర్జున్ పేర్కొన్నారు.

కరోనాపై పోరాటానికి విరాళం ప్రకటించిన తెలుగు సినీ ప్రముఖులు:

  • చిరంజీవి: రూ. 1 కోటి
  • ప్రభాస్: రూ. 4 కోట్లు
  • పవన్ కళ్యాణ్: రూ. 2 కోట్లు
  • అల్లు అర్జున్: రూ. 1 .25 కోట్లు
  • మహేష్ బాబు: రూ. 1 కోటి
  • జూ. ఎన్టీఆర్: రూ. 75 లక్షలు
  • రామ్ చరణ్: రూ. 70లక్షలు
  • నితిన్: రూ. 20 లక్షలు
  • త్రివిక్రమ్: రూ. 20 లక్షలు
  • కొరటాల శివ: రూ. 10 లక్షలు
  • అనిల్ రావిపూడి: రూ. 10 లక్షలు
  • వీవీ వినాయక్: రూ. 5 లక్షలు
  • దిల్ రాజు: రూ. 10 లక్షలు
  • సాయి ధరమ్ తేజ్: రూ. 10 లక్షలు
  • సుకుమార్: రూ. 10 లక్షలు
  • తమన్: రూ. 5 లక్షలు

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 5 =