ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొనాల్సిందిగా.. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం

Tollywood Star Hero Jr NTR Gets Invitation From TDP For NTR Centenary Celebrations,Tollywood Star Hero Jr NTR Gets Invitation,Star Hero Jr NTR Gets Invitation From TDP,Invitation For NTR Centenary Celebrations,For NTR Centenary Celebrations,Mango News,Mango News Telugu,Jr NTR Invited For NTR Centenary Celebrations,Junior NTR Gets Invite From TDP,Jr NTR Invited to Celebrate NTRs Birth Centenary,Tollywood Star Hero Jr NTR,Jr NTR Latest News And Updates,NTR Centenary Celebrations Latest News,NTR Centenary Celebrations Latest Updates

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) శత జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన హైదరాబాద్‌లోని కూకట్‌పలిలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకలకు సీనియర్ ఎన్టీఆర్‌ మనవడు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు టీడీపీకి అనుబంధంగా టీడీ జనార్దన్ నేతృత్వంలోని ఎన్టీఆర్‌ సావనీర్ కమిటీ సభ్యుడు నందమూరి రామకృష్ణ ఆయనకు ఆహ్వాన పత్రం అందజేశారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను టాలీవుడ్ అగ్రనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరియు ఆయన సోదరుడు రామకృష్ణలు పర్యవేక్షిస్తున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు సూచనల మేరకు నందమూరి కుటుంబ సభ్యులను.. ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్‌, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్, సీనియర్ ఎన్టీఆర్‌ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులను ఎన్టీఆర్‌ సావనీర్ కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం జూబ్లీహిల్స్ లోని జూనియర్ ఎన్టీఆర్‌ నివాసానికి చేరుకున్న టీడీ జనార్దన్, నందమూరి రామకృష్ణలు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఇక ఇటీవలే విజయవాడ వేదికగా శత జయంతి వేడుకలకు భారీ బహిరంగ సభతో అంకురార్పణ చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే ఈ నెల 27, 28 తేదీలలో రాజమండ్రి వేదికగా మహానాడు కార్యక్రమం జరుగనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here