రేపు బాపట్లకు సీఎం జగన్.. నిజాంపట్నంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా నగదు జమ

CM Jagan To Distribute Financial Assistance Under YSR Matsyakara Bharosa in Nizampatnam Bapatla Tomorrow,CM Jagan To Distribute Financial Assistance,YSR Matsyakara Bharosa,YSR Matsyakara Bharosa in Nizampatnam Bapatla,Mango News,Mango News Telugu,YSR Matsyakara Bharosa 2023,YSR Matsyakara Bharosa Latest News And Updates,CM Jagan To Distribute YSR Matsyakara Bharosa,CM Jagan To Distribute YSR Matsyakara Bharosa In Bapatla,CM Jagan Latest News And Updates

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన నిజాంపట్నంలో మత్స్యకార కుటుంబాలకు ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం కింద ఐదో విడత నగదు జమ చేయనున్నారు. కాగా ప్రస్తుతం సముద్రంలో వేట నిషేధం అమలులో ఉన్నందున వారి జీవన భృతి కోసం ప్రభుత్వం సాయం కింద ఈ సొమ్ము అందజేయనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ రేపు ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిజాంపట్నం చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రసంగించిన తర్వాత సీఎం జగన్ బటన్ నొక్కడం ద్వారా లాబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేయనున్నారు. కాగా ఈ పథకం కింద ఎంపిక చేసిన ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి రూ.10 వేలు చొప్పున అందించనున్నారు. ముఖ్యమంత్రి బాపట్ల పర్యటన సందర్భంగా అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 3 =