లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అందుకే ఓటు వేయాలి: కేటీఆర్

This Is Why You Should Vote For Brs In Lok Sabha Elections Says KTR,This Is Why You Should Vote,Brs In Lok Sabha Elections,Ktr,Telangana, BRS, KTR, Lok Sabha Elections,Mango News,Mango News Telugu,BRS To Rectify Its Mistakes,Shift Focus To Lok Sabha Polls,KTR Tells Party Leaders,Lok Sabha Elections Latest News,Lok Sabha Elections Live Updates,Telangana Politics, Telangana Political News And Updates
Telangana, BRS, KTR, Lok sabha elections

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలవేడి ముగిసిందో లేదో.. అప్పుడే లోక్ సభ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ప్రధాన పార్టీలన్నీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి. తెలంగాణలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. 17కు 17 స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది.

అటు పదేళ్లుగా అధికారంలోవున్న బీఆర్ఎస్.. ఇటీవల జరిగిన ఎన్నికలతో అధికారానికి దూరమయింది. దీంతో ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో తమ సత్తా చాటుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని సరికొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ లోక్ సభ నియోకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రోజుకో నియోజకవర్గం చొప్పున కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇక లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలనే దానిపై సోషల్ మీడియాలో కేటీఆర్ వినూత్న క్యాంపెయిన్ మొదలు పెట్టారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలనే దానిపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 16, 17 లోక్ సభల్లో బీఆర్ఎస్ ఎంపీలు మొత్తం 4,754 ప్రశ్నలు అడిగారని.. కాంగ్రెస్ 1,271.. బీజేపీ 190 ప్రశ్నలు మాత్రమే అడిగారని చెప్పుకొచ్చారు. తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీలు అవిశ్రాతంగా పనిచేశారని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో.. డిమాండ్ చేయడంలో తమ ఎంపీలు ముందు ఉన్నారన్నారు.

తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించిన సమయంలో 2014లో తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ చెప్పారు. 2024లో కూడా తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. నాడు.. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం.. తెలంగాణ దళం.. బీఆర్ఎసేనని కేటీఆర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =