ఏపీలో ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు, కన్నబాబుకు అదనపు బాధ్యతలు

Additional Responsibility Given To Kannababu, Andhra Pradesh Latest News, AP Breaking News, AP Cabinet Latest News, AP Cabinet Portfolios Changed, Ap Political News, Mango News Telugu, Minister Kannababu, Two Portfolios Changed In AP Cabinet
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు రాష్ట్రమంత్రుల శాఖల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్వహిస్తున్న మార్కెటింగ్‌ శాఖను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. అలాగే మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖ నుంచి ఆహారశుద్ధి విభాగాన్ని వేరు చేసి దాన్ని కూడా మంత్రి కన్నబాబుకే అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జనవరి 30, గురువారం నాడు జీవో నెంబరు 12 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు చేసినట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ వద్ద పశుసంవర్ధక, మత్స్యశాఖలు మాత్రమే ఉన్నాయి.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here