పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

#HappyBirthdayPawanKalyan, #HBDPawanKalyan, celebrities tweets on pawan kalyan birthday, Happy Birthday Power Star Pawan Kalyan, janasena chief pawan kalyan, pawan kalyan, Pawan Kalyan Birthday, pawan kalyan birthday celebrations, Pawan Kalyan Birthday News, Pawan Kalyan Birthday Wishes, Power Star Pawan Kalyan Birthday

ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 వ తేదీ. ఈ సందర్భంగా ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక అభిమానులు #HBDPawaKalyan హ్యాష్ టాగ్ తో పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్లు, వీడియోలు, డిజైన్ పోస్టర్స్ పోస్టు చేస్తూ సోషల్ మీడియాలో కోలాహలం సృష్టించారు.

మరోవైపు కొంత విరామం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, బోనిక‌పూర్ కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న “వకీల్ సాబ్” చిత్రంలో పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్నారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా వకీల్‌సాబ్‌ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మోషన్‌ పోస్టర్ విడుదలతో అభిమానుల్లో ఉత్సాహాం రెట్టింపైంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న #PSPK27 అప్ డేట్ 12:30 గంటలకు, హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించబోయే #PSPK28 అప్ డేట్ 4:05 గంటలకు విడుదల కానున్నాయి. ఇక రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్దఎత్తున సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here