పీఏసీఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Mango News Telugu, Notification For PACS Elections, PACS Elections Notification Released, Primary Agricultural Credit Society Elections, Telangana Breaking News, Telangana PACS Elections, Telangana Political Updates

తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జనవరి 29న సంబంధిత అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఏసీఎస్ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటీసు విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే ఫిబ్రవరి 15న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లోగా సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాలకు సంబంధించిన 906 పీఏసీఎస్ లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అడిషనల్‌ రిజిస్ట్రార్‌ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. పీఏసీఎస్ చైర్మన్లు అందరూ కలిసి డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్ ను ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో డీసీసీబీ ఎన్నికకు సంబంధించి ప్రత్యేక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.

పీఏసీఎస్ ఎన్నికలను షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ: 30-01-2020
  • ఎలక్షన్ నోటిస్ జారీ : 03-02-2020
  • నామినేషన్ల స్వీకరణ: 06-02-2020 నుంచి 08-02-2020
  • నామినేషన పరిశీలన: 09-02-2020
  • నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా: 10-02-2020
  • పోలింగ్ తేదీ: 15-02-2020
  • ఓట్ల లెక్కింపు తేదీ: 15-02-2020
  • పలితాలు ప్రకటన: 15-02-2020
  • సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక: ఫలితాలు వచ్చిన మూడు రోజుల్లో ఎంపిక.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here