ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్‌ కుమార్‌, వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్సీ కవిత సహా పలువురి అభినందనలు

Telangana Deshapathi Srinivas Naveen Kumar and Venkatrami Reddy Takes Oath as MLCs Today,Telangana Deshapathi Srinivas Naveen Kumar,Venkatrami Reddy Takes Oath as MLCs Today,Deshapathi Srinivas Naveen Kumar Oath as MLC,Mango News,Mango News Telugu,Telangana MLCs Today,Deshapathi Srinivas Naveen Kumar Latest News,Venkatrami Reddy Latest News and Updates,Telangana MLCs Latest News,Telangana MLCs Live Updates,Telangana Latest News And Updates,Telangana News Today

తెలంగాణాలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్ఎస్ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్రామి రెడ్డిలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన చాంబర్‌లో ఈ ఉదయం ఈ ముగ్గురితో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డిలతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి శ్రీనివాస్‌, నవీన్‌ కుమార్‌, వెంకట్రామి రెడ్డిలకు అభినందనలు తెలియజేశారు.

కాగా ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ఈ ముగ్గురితో పాటుగా మరో స్వతంత్ర అభ్య‌ర్థి నామి‌నే‌ష‌న్లు దాఖలు చేశారు. అయితే పరిశీలన అనంతరం స్వతంత్ర అభ్యర్థి పాలమూరి కమల నామి‌నే‌ష‌న్ ను ఎన్ని‌కల రిట‌ర్నింగ్‌ అధి‌కారి తిర‌స్క‌రిం‌చారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఇతర అభ్యర్థులెవరూ పోటీ లేకపోవడం, బరిలో ఈ ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఉండడంతో, వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here