త్వరలో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా గౌరవెల్లి రిజర్వాయర్‌ ప్రారంభం – మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Announces CM KCR To Be Launched Gouravelli Reservoir Soon,CM KCR To Be Launched Gouravelli Reservoir Soon,Minister Harish Rao Announces Gouravelli Reservoir,Gouravelli Reservoir Soon,Gouravelli Reservoir Launched Soon,Mango News,Mango News Telugu,Gouravelli Will Be Completed,Gouravelli Reservoir,Gouravelli Reservoir Latest News,Gouravelli Reservoir Latest Updates,Gouravelli Reservoir Live News,Minister Harish Rao News Today,CM KCR News And Live Updates,Telangana Latest News And Updates

త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా గౌరవెల్లి రిజర్వాయర్‌ను ప్రారంభించనున్నామని తెలిపారు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు. ఈ మేరకు ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంక్షేమ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దీనికి ముందు మంత్రి గౌరవెల్లి రిజర్వాయర్‌ను సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ఈ రిజర్వాయర్‌ను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేశాయని, అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్‌ను ఎట్టకేలకు పూర్తి చేసుకున్నామని తెలిపారు. రిజర్వాయర్‌ ప్రారంభోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించుకుందామని, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభించుకుందామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భూనిర్వాసిత గిరిజనులు 185 మందికి రూ.8 లక్షల చొప్పున ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, దీనితో పాటు ఇంటి స్థలం కూడా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + nineteen =