2019లో ఒక్క ఛాన్స్ సెంటిమెంట్‌ వర్కవుట్ అవుతుందా?

Will You Give CM Jagan A Second Chance?,CM Jagan A Second Chance,Sentiment Will Work Out In 2019,YCP,Janasena,TDP,BJP,Chandrababu,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,CM Jagan,CM YS Jagan,CM YS Jagan Latest News,CM YS Jagan News,CM YS Jagan Election Campaign,Memantha Siddham Bus Yatra,Siddham,CM YS Jagan Bus Yatra

గత ఎన్నికలకు ముందు జగన్ నోట వెంట వచ్చిన ఒక్క ఛాన్స్ అన్న మాట.. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో జగన్‌కు భారీ  సింపతీ  ఓట్లను కురిపించింది.  2017 నవంబరు 6న ప్రారంభించిన పాదయాత్ర..  ఏపీ వాసుల తలరాతలను  ఒక్కసారిగా తలక్రిందులు చేసేసింది. అందుకే జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రియల్ సీన్ ఏంటో కళ్లకు కట్టినట్లు అర్థం అయిందని ఇప్పుడు ఏపీ వాసులు లబోదిబోమంటున్నారట.

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు సాధిస్తే, జగన్ రెడ్డి  పాలనలో అది 3 శాతం దిగువకు పడిపోయిందంటేనే ఆంధ్రప్రదేశ్‌ను తిరోగమన దిశలో ఎంతగా పరుగులు పెట్టించారో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి జగన్ పాలనలో ఏ వర్గమూ జగన్ పాలన పట్ల సంతృప్తిగా లేదన్నది మెజార్టీ వర్గాలు భావిస్తున్నాయి. బటన్ నొక్కి జగన్ పంచుతున్న సొమ్ములు అందుకుంటున్న లబ్ధిదారులలో కూడా ఏపీ అభివృద్ధి ఎక్కడ,తమ పిల్లల భవిష్యత్ ఏంటనే ఆందోళన క్లియర్‌గా కనిపిస్తోంది.

కానీ ఇటు సీఎం జగన్ మాత్రం 2019లో తన మేనిఫేస్టో భగవద్గీతతో సమానమని.. అందుకే తాను ఇచ్చిన హామీలను దాదాపు పూర్తి చేశామనే చెబుతూ వస్తున్నారు. కానీ ఏ పథకాలన్నీ ఎవరికి అందాయన్న ప్రశ్నలే కనుక వస్తే..  అక్కడ వైసీపీ సానుభూతిపరులే కనిపిస్తారు. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ అమ్మ ఒడి పథకం, రైతు భరోసా పథకం,   ప్రతి పేద వాడికీ ఇల్లు కట్టిస్తాం,ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, వడ్డీ లేని పంట రుణాలు,పగటిపూట ఉచిత విద్యుత్‌, వృద్ధాప్య పింఛన్,అక్క చెల్లెమ్మెలకు వడ్డీ లేని రుణాలు ఇలా పథకం ఏదయినా అది వైసీపీ సానుభూతిపరులకే వర్తిస్తుందన్న విమర్శలు ఏపీలో వినిపిస్తున్నాయి. ఈ ఐదేళ్లు  ఏపీలో ఇప్పుడు అదే చట్టం, అదే న్యాయంగా ఉందని జగన్ పాలనపై విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు.

వాలెంటీర్లను తన పార్టీ కార్యకర్తల్లా వాడుకోవడం నుంచి.. కేంద్రం నిధులను తన  ఖజానాకు మళ్లించుకోవడం, ప్రాజెక్టులు పక్కన పెట్టి ఉచిత పథకాలతో ప్రజలను బురిడీ కొట్టించడం, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం, జాబ్ క్యాలెండర్ అంటూ బూటకపు ప్రకటనలు చేయడం ఒకటా రెండా అడుగడుగునా జగన్ అరాచకాలు ఏపీలో  కనిపిస్తూనే ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

చివరకు మద్య నిషేధం అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి ..బ్రాండెడ్ లిక్కర్‌ను బ్యాన్ చేసి మరీ చీప్ లిక్కర్ అమ్ముకుంటున్న సీన్లు వీధివీధినా  కనిపిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఐదేళ్లలో బటన్ నొక్కుడు తప్ప వేరే మాటెత్తని సీఎం జగన్..టోటల్‌గా  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని డిలీట్ చేసేశారన్న అపవాదును కూడా మూట కట్టుకున్నారు. మరి సీఎం జగన్ కు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 3 =