ఆ ఇద్దరి నేతల పేరు వింటేనే భగ్గుమంటున్న కాపులు

Kapus get state power,Vote, YCP,TDP, BJP, Jana Sena ,Pawan Kalyan, Chandrababu, Jagan, Harirama Jogaiah, Mudragada Padmanabham,AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Kapus get state power,Vote, YCP,TDP, BJP, Jana Sena ,Pawan Kalyan, Chandrababu, Jagan, Harirama Jogaiah, Mudragada Padmanabham

కాపుల కోసం తమ జీవితం అంకితమన్న నాయకులు వైసీపీకి ఎందుకు కొమ్ముకాస్తున్నారన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. జనాభాలో రెండు, మూడు శాతం కూడా లేని ఓ కులానికి కొమ్ముకాసి, వాళ్లు అధికారంలోకి రావాలని ఆకాంక్షించడం కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లు కాదా అం ఎన్నో ఏళ్లుగా కాపులు మోసపోతున్నారని చెప్పిన నేతలు.. ఇప్పుడు కులానికి ఏ సమాధానం చెబుతున్నారు. ఫ్యామిలీ పదవుల కోసమే వైసీపీకి కాపు కాస్తున్నారా.. వైసీపీకి ఓట్లు వేస్తే కాపులకు రాజ్యాధికారం వస్తుందా.. కేవలం ఓట్ల వేళ కాపులకు హామీలిచ్చి మరిచిపోతే సరిపోతుందా.. ఇప్పటివరకు కాపులకు రాజ్యాధికారం రాకపోవడానికి, రాజకీయ చైతన్యం పెరగకపోవడానికి ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్యలు కారణం కాదా అన్న వాదన వినిపిస్తోంది.

కాపుల సత్తా చూపించి.. రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కావాలంటే జనసేనతోనే సాధ్యమనే విషయాన్ని తెలిసి కూడా వైసీపీకి ఈ ఇద్దరు నేతలు ఎందుకు కొమ్ము కాస్తున్నట్లు అని కాపు నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాపుల ఓట్లు చీల్చి వైసీపీకి మేలు చేయాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నట్లు.. వైసీపీ ఎలాంటి ప్యాకేజీలతో ఆకర్షించిందనే కొత్త ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి. కాపుల ఆత్మగౌరవన్ని వైసీపీకి ఎందుకు తాకట్టుపెడుతున్నట్లు. తమ మాట వినడంలేదనే ఒకే ఒక అర్థం పర్థం లేని షాకుతో వైసీపీకి మద్దతు ఇవ్వడాన్ని కాపు సమాజం జీర్ణించుకుంటుందా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

దీంతో పాటు జగన్ అధికారంలోకి రాకముందు నుంచీ కాపులను వంచించేందుకు జగన్‌ ప్లానుల మీద ప్లానులు చేశారన్న వాదన వినిపిస్తోంది. ముద్రగడ, చేగొండి ద్వారా కాపుల్లో చీలిక తెచ్చే కుట్రకు తెరలేపారు. కాపులంతా పవన్‌కు అండగా నిలవాలన్న నాయకుల నోట జై జగన్‌ అనిపించడం వెనుక ఉన్న కుట్రను కాపు జాతి ఇప్పటికే అర్థం చేసుకుంటోంది. కాపుల సంక్షేమానికి ఏం చేశారని జగన్‌ ఆ ఇద్దరు నేతలకు మంచిగా కనిపిస్తున్నారు. పేరుకే కాపు కార్పొరేషన్‌ పేట్టి నిధులు నిధులు ఇవ్వకుండా జాతిని మోసం చేసినందుకు జగన్‌కు మద్దతు ఇస్తున్నారా.. ఏం ఊడబొడిసారని ముద్రగడ జై జగన్‌ అంటున్నారు. కాపుల కోసం జగన్‌ చేసిన మంచి పని ఒకటైనా ఉందా అని కాపు సమాజం ప్రశ్నిస్తోంది.

కాపులంతా ఐక్యమవుతున్న సందర్భంలో ముద్రగడ, హరిరామ జోగయ్య వ్యవహారం ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి అనే చర్చ జరుగుతోంది. ఆ రెండు కుటుంబాలు జనసేనతో కలిసి ప్రయాణిస్తామంటే వద్దన్నది ఎవరు? ముద్రగడ కోసం జగన్‌ ఆయన ఇంటికి వెళ్లారా.. తన ఇంటికి పవన్‌ రాలేదనడం ఎంత వరకు కరెక్ట్‌ అన్న వాదన కూడా వినిపిస్తోంది.ఇప్పటికైనా జనసేనను గెలిపించుకుని.. కాపుల సత్తా చాటేందుకు.. వారి ఐక్యతను దెబ్బతీసే కుట్రలను ప్రతి కాపు బిడ్డ తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం పొత్తులో భాగంగా పవన్‌కు ఇచ్చిన 21 సీట్లలో అయినా.. జనసేనను గెలిపించుకుంటే కాపుల బలం.. ఆ సామాజికవర్గం సత్తా అందరికీ తెలిసి వస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 6 =